Begin typing your search above and press return to search.

విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు పండగే

By:  Tupaki Desk   |   13 Jan 2017 4:12 PM GMT
విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు పండగే
X
ఒకప్పుడు హైదరాబాద్ లో విజువల్ ఎఫక్ట్స్ కంపెనీలు అంటే.. పెద్దగా ఎవ్వరికీ తెలియదు. వాటి కారణంగా మెగాస్టార్ చిరు అంజి సినిమా దాదాపు 6 సంవత్సరాలు లేటైంది. ఆ తరువాత సదరు టెక్నాలజీ అంతా హైదరాబాద్ వచ్చేయడంతో.. అరుంధతి సినిమా అద్భుతంగా వచ్చింది. ఇక రాజమౌళి తన మగధీరతో సదరు టెక్నాలజీని భారీగా వాడుకున్నాడు. ఈగ్ అండ్ బాహుబలి అందుకు ఎక్సటెన్షన్ అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు మన లోకల్ విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిని మరింత పెంచింది. క్వాలిటీ పరంగా ఇంకా పెరగాలంటే.. ఇంకా ఖరీదైన కంప్యూటర్లు.. ఎక్విప్మెంట్ కావాలి తప్పించి.. టెక్నీషియన్ల పరంగా మనం ఇప్పుడు భారీ స్థాయిలోనే ముందుకు దూసుకొచ్చేశాం.

ఇక గౌతమిపుత్ర శాతకర్ణి కోసం చాలా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూశాయి. దానికి కారణం ఏంటంటే.. బాహుబలి హిట్టయ్యాక తెలుగు అండ్ తమిళంలో విజువల్ ఎఫెక్ట్స్ వాడి సినిమాలు తీయడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. కాకపోతే విడ్డూరం ఏంటంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నా కూడా బాజీరావ్ మస్తానీ అండ్ కాష్మోరా వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక తక్కిన సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అన్నీ తేలిపోవడంతో.. దానికితోడు కంటెంట్ కూడా టపీ కట్టేయడంతో.. ఆ సినిమాలు ఆడలేదు. వెరసి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలకు ఎక్కడ పని తక్కువ అయిపోతుందా అనే భయం పట్టుకుంది. కాని ఇప్పుడు రిలీఫ్‌ వచ్చేసింది. థ్యాంక్స్ టు శాతకర్ణి.

కరక్టు స్టయిల్లో వాడుకుంటే.. అతి తక్కువ కాలంలో అబ్బురపరిచే వి.ఎఫ్.ఎక్స్. ఔట్పుట్ వెండితెరపైకి తీసుకురావచ్చు అని క్రిష్‌ అండ్ బాలయ్య ప్రూవ్ చేశారు. దానికితోడు కంటెంట్ అదిరిపోతే.. సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కూడా అర్ధమైంది. ఖచ్చితంగా ఇప్పుడు మరింతమంది ఫిలిం మేకర్లు విజువల్ ఎఫెక్ట్స్ వైపు పరుగులు తీసే ఛాన్సుంది. ఇక రానా 'ఘాజీ' కూడా హిట్టయితే మాత్రం.. మన కంపెనీలకు పండగే. ఇదే సమయంలో హైదరాబాద్ తో పాటు అమరావతిలో సదరు గ్రాఫిక్స్ కంపెనీలు తయారైతే.. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/