Begin typing your search above and press return to search.
దేవసేన.. కట్టప్ప.. అంతా గ్రాఫిక్సే
By: Tupaki Desk | 21 July 2015 10:28 AM GMTబాహుబలి లో విఎఫ్ ఎక్స్ సిత్రాలెన్నో. విజువల్ గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత ఉందీ చిత్రంలో. రాజమౌళి అసాధారణమైన ఊహకు విజువల్ రూపం ఇవ్వడానికి గ్రాఫిక్స్ లో తలపండిన నిపుణులు పనిచేశారు. అసలు ఈ సినిమా లో దేవసేన రూపురేఖల్ని విఎఫ్ ఎక్స్ లో ఎలా తీర్చిదిద్దారంటే..
ఈ చిత్రంలో వార్ ఎపిసోడ్స్ లో 3000మందిపై చిత్రీకరిస్తే.. దానినే విఎఫ్ ఎక్స్ లో 50వేల మందిగా చూపించాం. అదంతా గ్రాఫిక్స్ పనితనమే. అలా భారీ జనసందోహంతో ఐదు నిమిషాల విజువల్ ని తయారు చేశారట. అలాగే కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్ లో తప్పించుకుని పారిపోతున్న మాహిష్మతి రాకుమారుడి (అడివి శేష్) తల తెగి పడాలి. ఆ సీన్ లో బాహుబలి అతడి వెంట పడేప్పుడు కట్టప్ప (సత్యరాజ్) అడ్డు తగుల్తాడు. గుర్రం పై ఉన్న కరవాలంలోంచి కత్తి దూసేందుకు బాహుబలి, కట్టప్ప పోటీ పడతారు. అయితే బాహుబలి పైనుంచి దూకుతాడు. అలా దూకి కత్తి అందుకున్న వెంటనే ప్రిన్స్ తల తెగి కింద పడుతుంది. ఆ ఎపిసోడ్ లో సత్యరాజ్ ఫేస్ కూడా కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నది సత్యరాజ్ కాదు. బాడీ డబుల్ ఆర్టిస్ట్. ఆ స్థానం లో సత్యరాజ్ హెడ్ ని తగిలించారంతే. దీన్ని 3డి గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారు.
అలాగే దేవసేన క్యారెక్టర్ సినిమాలో అత్యంత కీలకమైనది. అనుష్క అంతటి అందగత్తెను వికృతంగా చూపించాలి. మాహిష్మతి కోటలో సంకెళ్లతో బంధించబడి ఉన్న దేవసేన రాజుగారి చేతిలో ఎన్నో హింసలకు గురవుతుంది. కాబట్టి అందుకు తగ్గట్టే రూపాన్ని ఆవిష్కరించాలి. దానికోసం ఏకంగా 100మందితో కూడిన విఎఫ్‌ఎక్స్ టీమ్ పనిచేసింది. వయసు పెద్దగా చూపించాలి. ముఖంపై గాట్టు, నెత్తురు, ఎర్రని జీరతో ఉన్న కళ్లు, తలకట్టులో తెలుపు రంగు పాయలు ఇవన్నీ చూపించాలి. దీనికోసం చెన్నయ్, హైదరాబాద్ నుంచి బోలెడుమంది గ్రాఫిక్స్ నిపుణులు పనిచేశారు. అనుష్క మామూలుగా ఉడగానే విజువల్‌ని షూట్ చేస్తే, ఆ తర్వాత కావాల్సిన మార్పుల్ని గ్రాఫిక్స్‌లో చేశారన్నమాట!