Begin typing your search above and press return to search.
షాక్: ఉత్తమ విలన్‌ను బ్యాన్ చేయాల్సిందే
By: Tupaki Desk | 7 April 2015 8:15 AM GMTఅసలు కమల్ హాసన్ సినిమా అంటేనే ఎవరో ఒకరు హర్ట్ అవ్వకుండా ఉండరనుకుంట. ఒకసారేమో గాంధీ గారి ఫాలోవర్లు హర్ట్ అవుతారు. ఇంకోసారి ముస్లిం సంఘాలు హర్ట్ అవుతాయి. ఇప్పుడేమో హిందువులు హర్ట్ అయ్యారట. పాపం కమల్, ఎప్పుడు ఏ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నా కూడా ఈ హర్టయ్యే జనాల సంఘం మనోభావాలు దెబ్బతినకుండా ఉండట్లేదు.
''ఉత్తమ విలన్ సినిమాలోని ఓ పాటలో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు మధ్య జరిగే సంభాషణ ఉంది. ఈ సంభాషణలో విష్ణుమూర్తిని కాస్త దూషించారు. అవన్నీ వింటే ఇప్పుడు విష్ణుమూర్తిని ఆరాధాంచేవారి మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోరుతున్నాం'' అంటూ విశ్వహిందూ పరిషద్ నేతలు ఇప్పుడు చెన్నయ్ పోలీస్ కమీషనర్‌ను కలిశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కమల్ సినిమా తీయడం చాలా బాధాకరంగా ఉందంటూ విహెచ్‌పి లీడర్ కె.ఎల్.సత్యమూర్తి ఈ సినిమా బ్యాన్‌కు పిలుపునిచ్చారు. బహుశా సినిమాను సినిమాగా చూడలేకపోతున్నా అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది. ఇకపోతే ఈ బ్యాన్ డిమాండ్ ప్రభావం ఉత్తమ విలన్ మీద ఎంతవరకు ఉంటుందో చూడాల్సిందే.