Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ ను కొడితే రూ.2 ల‌క్ష‌లిస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   1 Jun 2018 5:44 AM GMT
స‌ల్మాన్ ను కొడితే రూ.2 ల‌క్ష‌లిస్తార‌ట‌!
X
ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `ప‌ద్మావ‌త్`చిత్రంపై దేశవ్యాప్తంగా నానా ర‌చ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో రాజ్ పుత్ స్త్రీల గౌర‌వానికి ప్ర‌తీక అయిన రాణి ప‌ద్మావ‌తి దేవి పాత్ర‌ను కించ‌ప‌రిచారంటూ....దేశ వ్యాప్తంగా రాజ్ పుత్ క‌ర్ణిసేన ఆందోళ‌న‌లు చేపట్ట‌డంతో ఆ సినిమా విడుద‌లలో జాప్యం జ‌రిగిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు కొన్ని మార్పులు చేర్పులతో పాటు పేరు మార్పు చేసిన అనంత‌రం విడుద‌లైన ఆ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. ఇపుడు అదే త‌ర‌హాలో మ‌రో బాలీవుడ్ చిత్రంపై మ‌రో వ‌ర్గం మండిప‌డుతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `ల‌వ్ రాత్రి` సినిమా త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉంద‌ని ‘హిందూ హై ఆజ్’ అనే సంస్థ ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఈ సినిమాను నిషేధించ‌క‌పోతే ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం చేస్తామ‌ని ఆ సంస్థ ఆగ్రా న‌గ‌ర విభాగం అధ్య‌క్షుడు గోవింద్ ప‌రాష‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా, స‌ల్మాన్ ఖాన్ ను కొట్టిన వారికి రూ.2 ల‌క్ష‌ల పారితోషికం ఇస్తాన‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అనుచరుడు, ‘హిందూ హై ఆజ్’ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. సల్మాన్ ను బహిరంగంగా కొట్టినవారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తానని ప‌రాష‌ర్ సంచ‌ల‌న‌ ప్రకట‌న చేశారు. నవరాత్రి పండుగను అవమానించేలా ‘లవ్ రాత్రి’ పేరుతో స‌ల్మాన్ సినిమా తీశారని - హిందువుల‌ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ఆరోపించారు. ఆగ్రాలోని భగవాన్ టాకీస్ లో ఈ సినిమా పోస్టర్లను ఆ సంస్థ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌రాష‌ర్ దహనం చేశారు. సల్మాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ....ఆ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాకు సెన్సార్ అనుమతి నిరాకరించాలని, లేకుంటే భ‌విష్య‌త్తులో భారీగా ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చరించారు. త‌మ ఆందోళ‌న‌ను ఖాత‌రు చేయ‌కుండా ఈ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను దహనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌రులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా విడుద‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ సినిమా విష‌యంలో సెన్సార్ ఎలా స్పందిస్తుందో అన్న సంగ‌తి ఆస‌క్తిక‌రంగా మారింది.