Begin typing your search above and press return to search.

కాపీ కథ అనగానే సీరియస్ అయ్యాడు

By:  Tupaki Desk   |   26 Dec 2017 1:00 PM GMT
కాపీ కథ అనగానే సీరియస్ అయ్యాడు
X
సినిమా కథ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోరు కానీ కాపీ కథ అని తేలితే మాత్రం చూడటానికి ఏ మాత్రం ఇష్టపడరు. సినిమా ఎంత బావున్నా సరే ఎందుకో ఇష్టపడరు. రీమేక్ అని చెబితే పరవాలేదు కానీ ఎవరికీ తెలియకుండా కాపీ కొడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందుకే మన దర్శకులు అలా ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అల్లు హీరో సినిమాకు మాత్రం కాపీ అనే ముద్ర బలంగా పడినట్లు తెలుస్తోంది.

శిరీష్ నటించిన ఒక్క క్షణం పార్లెల్ లైఫ్ అనే కొరియన్ మూవీ ఆధారంగా సినిమా తెరకెక్కించారని కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఎవరూ ఊహించని విధంగా ప్యారెలల్ లైఫ్ కథ ఆధారంగానే హక్కులను కొనుక్కోని 2 మేమిద్దరం అనే సినిమాను రీమేక్ చేశారు. అయితే ఆ చిత్ర నిర్మాత లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు టాక్ వినిపించింది. ఆ తరువాత ఇద్దరు ఓ అండర్‌స్టాండింగ్‌కు రావడంతో సైలెంట్ అయ్యిందని కామెంట్స్ వినిపించాయి. అయితే రూమర్స్ ఎక్కువగా రావడంతోఈ దర్శకుడు విఐ.ఆనంద్ చాలా సీరియస్ అయ్యాడు. ఒకరికి వచ్చిన థాట్ మరొకరికి రాకుండా ఉంటుందా?. ప్యార్లల్ లైఫ్ అనేది ఒక కాన్సెప్ట్. వందేళ్ళ నుంచి అది చర్చనీయాంశంగా ఉంది. ఇంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా అని ఒక దెయ్యం సినిమా తీశాను. అందువల్ల అంతకుముందు వచ్చిన దెయ్యాల కథలను కాపీ కొట్టినట్లా?'' అని ప్రశ్నించారు విఐ ఆనంద్.

అంతే కాకుండా సైన్స్ మీద ఉన్న కాన్సెప్ట్ లపై ఎన్ని సినిమాలను అయినా తీయవచ్చు అని వివరించాడు. ఇక 'ఒక్క క్షణం' సినిమా 28 రిలీజ్ కాబోతోందనిబ్ ఎవరి సినిమా ఏంటో అనేది అప్పుడు తేలుతుంది అని బదులు ఇచ్చారు.