Begin typing your search above and press return to search.

'స్లీప్ పెరాల‌సిస్‌‌'తో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ హీరో..!

By:  Tupaki Desk   |   22 April 2020 2:00 PM GMT
స్లీప్ పెరాల‌సిస్‌‌తో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ హీరో..!
X
'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్. అంతేకాకుండా ఈ చిత్రంలో విక్కీ నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 'రాజీ' 'ఉరీ' 'మనమార్జియాన్' 'సంజు' 'లస్ట్ స్టోరీస్' సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో అతనిప్పుడు బిజీగా ఉన్నాడు. వెండితెరపై అతని జీవితం వేగంగా దూసుకెళ్తోంది. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు విక్కీ కౌశల్ తెలిపాడు. అంతేకాకుండా తాను 'స్లీప్ పెరాలసిస్'తో చాలా సార్లు బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇన్‌ స్టాగ్రామ్‌ లైవ్‌ లో ‘మీరు నిజ జీవితంలో ఎప్పుడైనా దెయ్యాన్ని చూశారా’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పాడు. తాను కొన్నిసార్లు ‘స్లీప్ పెరాలసిస్‌’ను ఎదుర్కొన్నానని.. అది చాలా భయంకరంగా ఉందని అన్నాడు. ఇక 'దెయ్యాలు అంటే భయమా' అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు తనకు దెయ్యం సినిమాలు అన్నా.., కథలు అన్నా చాలా భయమని విక్కీ చెప్పాడు.

అయితే గతేడాది దెయ్యాల నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మించిన 'భూత్' అనే హారర్ సినిమాలో నటించాడు విక్కీ. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఆయన్ని దెయ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు నెటిజన్లు. 'స్లీప్ పెరాలసిస్' అంటే.. ఒక్కోసారి నిద్రలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చిన సమయంలో మనిషి స్పృహలో ఉంటాడు కానీ అతని శరీరం మాత్రం కొన్ని క్షణాల పాటు అతని స్వాధీనంలో వుండదు. దాంతో అతనిలో చలనం వుండదు. అంతా తెలుస్తూనే వుంటుంది కానీ నిద్రలోంచి లేవలేడు. ఇలాంటి సందర్భం అందరికి ఎదురవుతూనే ఉంటుంది. ఆ క్షణంలో అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా విక్కీ కౌశల్ ప్రస్తుతం ఉద్ధమ్ సింగ్ బయోపిక్ 'సర్దార్ ఉద్ధమ్ సింగ్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్రానికి సుజీత్ సర్కార్ డైరెక్షన్ చేస్తుండగా రోనీ లాహిరి మరియు షీల్ కుమార్ లు నిర్మిస్తున్నారు. ఉద్ధమ్ సింగ్ జలియన్ వాలా భాగ్ దుర్ఘటనలు బాధ్యుడైన డయ్యర్ మీద రివేంజ్ తీర్చుకొనే వర్గంలో ఉంటాడు. ఈ విప్లవకారుడి పాత్రలో విక్కీ కనిపించబోతున్నాడు.