Begin typing your search above and press return to search.

విక్కీ.. కత్రీనాల పెళ్లిపై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   7 Dec 2021 10:31 AM GMT
విక్కీ.. కత్రీనాల పెళ్లిపై ఫిర్యాదు
X
బాలీవుడ్‌ స్టార్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్‌ మరియు కత్రీనా కైఫ్ లు పెళ్లికి సిద్దం అయ్యారు. రాజస్థాన్‌ లోని మాధోపూర్ జిల్లాలోని ప్రముఖ కోట లో వీరి వివాహం జరుగబోతుంది. వీరి పెళ్లి కోసం చుట్టుపక్కల హోటల్స్ అన్ని కూడా పూర్తిగా వారం రోజులకు గాను బుక్‌ చేశారు. ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బయటి వారు ఎవరు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే విక్కీ.. కేట్ ల వివాహం జరిగే ప్రాంతంకు కొద్ది దూరంలో ఉండే ప్రముఖ చౌత్ మాతా మందిర్ ఉందట. అక్కడకు ప్రతి రోజు వేల కొద్ది భక్తులు వచ్చి మాత దేవిని దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి మాతా దేవి ఆలయంకు రస్తా లేకుండా పెళ్లి నిర్వాహకులు చేశారట. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేయడంతో భక్తులకు ఇబ్బందిగా మారిందట.

చౌత్‌మాతా దేవి ఆలయంకు భక్తులు వెళ్లకుండా చేయడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిర్వాహకుల వద్దకు వెళ్లగా వారి నుండి స్పందన రాలేదట. దాంతో పోలీసులను ఆశ్రయించగా వారికి పర్మీషన్ ఉందని చెప్పారట. దాంతో చేసేది లేక కోర్టును స్థానికులు ఆశ్రయించారు అంటూ సమాచారం అందుతోంది. స్థానిక మీడియా వర్గాల వారు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. పెళ్లి జంట ఈ విషయంలో వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు. పెళ్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి మాతా దేవిని దర్శించుకుని వెళ్తారు. కనుక రోడ్డు క్లీయర్‌ చేయాలని వారు కోర్టు ద్వారా పెళ్లి నిర్వాహకులను కోరుతున్నారు.

ఇప్పటికే పెళ్లి ఈవెంట్‌ ను నిర్వహిస్తున్న వారికి మరియు దంపతులు కాబోతున్న వారికి కూడా ఈ నోటీసులు వెళ్లాయని చెబుతున్నారు. పెళ్లి కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఉంటేనే వారికి పెళ్లికి అనుమతించాలని నిర్వాహకులకు తెలియజేయడం జరిగిందట. ఒక వేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే కోవిడ్ నెగటివ్ టెస్టు తప్పనిసరి అంటున్నారు. మొత్తానికి విక్కీ మరియు కత్రీనాల పెళ్లి వార్తలు బాలీవుడ్‌ మీడియాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరంగా మారాయి.