Begin typing your search above and press return to search.
కత్రినా - విక్కీ మళ్లీ అడ్డంగా దొరికారే
By: Tupaki Desk | 24 Jan 2020 5:57 AM GMTబాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్- యూరి ఫేం విక్కీ కౌశల్ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్. ఈ జోడీ గత కొంతకాలంగా ఒకరినొకరు వీడలేనంత సన్నిహితులు అయిపోయారు. ఒక రకంగా ఇద్దరి మధ్యా చాటుమాటు వ్యవహారం పరాకాష్టకు చేరుకుందన్నది బాలీవుడ్ మీడియా కథనాల సారాంశం.
ప్రస్తుతం డీప్ లవ్ లో ఉన్నారు. అందుకే రేయి పగలు అనే తేడా లేకుండా ఆ ఇద్దరూ ప్రేమ పావురాల్లా చెట్టు పుట్ట అంటూ విహరిస్తున్నారని కొంత కాలంగా మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. గత ఏడాది దీపావళికి ఓ స్నేహితుడి ఆహ్వానాన్ని మన్నించి జంటగా వెళ్లి ఎంజాయ్ చేసిన సంగతి బయటపడింది. ఆ పార్టీలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కలిసిపోయిన ఓ ఫోటో ఆధారం దొరకడంతో `బీటౌన్ న్యూ లవ్ బర్డ్స్` అంటూ కథనాలు జోరుగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈజంట మరోసారి అడ్డంగా దొరికిపోయింది. విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కౌశల్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ లాంచ్ లో మరోసారి విక్కీ-కత్రిన జంటగా కనిపించి మీడియా లో హాట్ టాపిక్ గా మారారు.
ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది! అన్న ఊహాగానాలకు మరోసారి ప్రూఫ్ దొరికినట్టయ్యింది. విక్కీ ఆహ్వానం మేరకు కత్రిన ఈ లాంచింగ్ వేడుక కు హాజరైంది. విక్కీతో కలిసి జంటగా ఆవిష్కరించింది. అనంతరం విక్కీ కౌశల్ కుటుంబ సభ్యుల తో కలిసి కత్రిన డిన్నర్ డేట్ ని ఎంజాయ్ చేసింది. విక్కీ ఫ్యామిలీ మెంబర్స్ కత్రినాను తమ కుటుంబంలో కలిపేసుకుని ప్రేమను కురిపించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు దీనిని కేవలం స్నేహం అని వాదిస్తున్నా... మెజారిటీ వర్గం మాత్రం ఇద్దరి మధ్య వీడదీయరాని బంధం ఏర్పడిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జంటకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
విక్కీ-కత్రినా జంటగా త్వరలో ఓ సినిమా కూడా తెరకెక్కనుందని సమాచారం. మరి ఈ క్రేజీ లవ్ బర్డ్స్ ని డైరెక్ట్ చేసేది ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ఎఫైర్ వార్తలపై ఇప్పటి వరకూ కత్రిన గానీ... విక్కీ గానీ స్పందించనేలేదు. కత్రినా సన్నిహితులు మాత్రం ఆ ఇద్దరూ ఇంకా సింగిల్స్ అని.. కత్రినా ఏ హీరోతోనూ డేటింగ్ లో లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అసలు కంటే కొసరు ప్రచారమే ఎక్కువగా ఉంది. ఇందులో నిజం ఏమిటి? అన్నది కత్రిననే చెబుతుందేమో చూడాలి.