Begin typing your search above and press return to search.
100కోట్లు దేనికి? సంగీత్ టు రిసెప్షన్ విక్కీ-క్యాట్ ఫ్యాట్ వెడ్డింగ్ ప్లాన్!
By: Tupaki Desk | 2 Dec 2021 4:40 AM GMTబాలీవుడ్ లో వరుసగా బ్యాండ్ భాజా బరాత్ కొనసాగుతోంది. అక్కడ వెడ్డింగ్ సీజన్ ఫుల్ ఫ్లోలో సాగుతోంది. విక్కీ కౌశల్ -కత్రినా కైఫ్ జంట పెళ్లి.. ఈ సీజన్ వివాహాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో ఒకటి. తాజా నివేదిక ప్రకారం.. విక్కీ- కత్రినా డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని ఒక విలాసవంతమైన రిసార్ట్ లో వివాహం చేసుకోనున్నారు. సవాయ్ మాధోపూర్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌత్ కా బర్వారాలోని హెరిటేజ్ ప్రాపర్టీలో మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. చౌత్ కా బర్వారా కొండపై ఉన్న శతాబ్దాల నాటి చౌత్ మాత ఆలయం ఎంతో పాపులర్ అన్న సంగతి విధితమే.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. వివాహ కార్యక్రమం డిసెంబర్ 7 నుంచి సంగీత్ తో ప్రారంభమవుతుంది. 8వ తేదీన మెహందీ .. 9వ తేదీన వివాహం జరుగుతుంది. అనంతరం రిసెప్షన్ 10న జరుగుతుంది. అతిథులు జైపూర్ లోని సమీప విమానాశ్రయంలో దిగవలసి ఉంటుంది, అయితే చార్టర్డ్ ఫ్లైట్ ఉన్న వ్యక్తులు సవాయి మాధోపూర్ నగరంలోని హెలిప్యాడ్ లో దిగవచ్చు. విక్కీ -కత్రినా డిసెంబర్ 6న వివాహ వేదిక వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఈ జంట సన్నిహితులు .. కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద చాలా ముందే ఉంటారని తెలిసింది. రోహిత్ శెట్టి- కరణ్ జోహార్- వరుణ్ ధావన్ .. అతని భార్య నటాషా ఇతర అతిథులు సవాయ్ మాధోపూర్ లోని ఫైవ్ స్టార్ ప్రాపర్టీలో ఉంటారు. ఈ పెళ్లి కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతిథులు బస చేసేందుకే భారీ మొత్తం ఖర్చు కానుండగా.. ఇతరత్రా హంగుల కోసం అసాధారణ బడ్జెట్లు కేటాయించారని తెలిసింది. ఈ పెళ్లిని సెలబ్రిటీ వరల్డ్ లోనే నెవ్వర్ బిఫోర్ అనేలా.. యూనిక్ గా డిజైన్ చేసారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి.
ముంబై నుండి ఒక డ్యాన్స్ ట్రూప్ వేదిక వద్దకు చేరుకుని కత్రినా కైఫ్ పాపులర్ డ్యాన్స్ నంబర్ లను రిహార్సల్ చేస్తోంది. ``అతిథులకు ప్రవేశం కోసం రహస్య కోడ్ ఇచ్చారని తెలిసింది. వారు తమ మొబైల్ ఫోన్ లను లోనికి తేవడానికి లేదు. పెళ్లి నుంచి ఎటువంటి చిత్రాలు లేదా వీడియోలు లీక్ చేసేందుకు వీల్లేదు. సవాయ్ మాధోపూర్ - జైపూర్ నుండి అతిథులను తీసుకువెళ్లే డ్రైవర్ లకు ప్రాథమిక ఫోన్ లు అందిస్తారు. స్మార్ట్ ఫోన్ లు ఎలో చేయరు. తద్వారా వారు అతిథుల చిత్రాలను క్లిక్ చేయలేరు.