Begin typing your search above and press return to search.
విక్ - క్యాట్ మధ్యలో అప్పుడే ఆవిడెవరు?
By: Tupaki Desk | 12 Jun 2022 10:30 AM GMTయంగ్ హీరో విక్కీ కౌశల్ సీనియర్ నటి కత్రీనా కైఫ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట అన్యోన్యత అంతర్జాలంలో నిరంతరం హాట్ టాపిక్. ఆ ఇద్దరూ ఒకరికోసం ఒకరు అన్నట్టుగా నిరంతరం కపుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే అభిమానులు వాటిని ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇంతలోనే అతడు ఆమె మధ్యలో ఈమె ఎవరు? అంటూ నెటిజనుల్లో డిబేట్ మొదలైంది. దానికి కారణం ఫరాఖాన్. వెటరన్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ ఫరాఖాన్ తాజాగా ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి విక్కీ మరొకరిని కనుగొన్నారు! అంటూ కత్రినను ఆట పట్టించారు. ఈ ఫోటోలో ఫరా విక్కీ భుజాలపై చేతిని ఆన్చి రొమాంటిక్ గా కనిపించారు. `మరొకరిని కనుగొన్నారు` అని ఫరాఖాన్ కామెంట్ చేయగా నెటిజనుల నుంచి ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి.
విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ బాలీవుడ్ లో అత్యంత పాపులారిటీ ఉన్న జంట. గత సంవత్సరం డిసెంబర్ లో ప్రేమ పక్షులు పెళ్లితో ఒకటయ్యారు. అప్పటి నుండి ఈ జంట షేర్ చేసే ఏ ఫోటో వీడియో అయినా అభిమానుల్లో వైరల్ గా దూసుకెళుతోంది. ఇప్పుడు ఫరాఖాన్ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ అంతే వేగంగా వైరల్ అయ్యింది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విక్కీ `మరొకరిని కనుగొన్నాడు` అని ఫరా వ్యాఖ్యానించగా.. విక్కీ - కత్రినా ఇద్దరూ ఫరా ఖాన్ తో సరదాగా సోషల్ మీడియాలో పరిహసమాడారు.
ఫరా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ విదేశాల్లో షూటింగ్ స్పాట్ నుంచి షేర్ చేసినది. అందమైన దేశం క్రొయేషియాలో ఆ ఇద్దరూ ఓ గోడకు ఆనుకుని ఫోటో దిగారు. విక్కీ తెల్లటి టీ షర్ట్ నీలిరంగు డెనిమ్ ప్యాంట్ ధరించి స్మార్ట్ గా కనిపించగా .. ఫరా కూడా అంతే స్టైలిష్ లుక్ తో కనిపించింది. ఫోటోను షేర్ చేస్తూ.. ఫరా ఖాన్ ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.. ``క్షమించండి కత్రినా కైఫ్ అతను వేరొకరిని కనుగొన్నాడు`` అంటూ నాలుక కరుచుకునే ఈమోజీని షేర్ చేసారు.
వెంటనే కత్రీనా తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోని మళ్లీ షేర్ చేస్తూ దానికి ఊహించని విధంగా ఉల్లాసకరమైన సమాధానం ఇచ్చింది. అందులో ``మీకు అనుమతి ఉంది ఫరాఖాన్ జీ..`` అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలు షేర్ చేస్తూ...కల్ హో నా హోలోని కుచ్ తో హువా హై పాటను కూడా జోడించారు. కొద్దిసేపటి తర్వాత విక్కీ కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఫన్నీగా జవాబిచ్చాడు. ``మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే`` అనేది దాని సందేశం.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ఇద్దరూ భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. విక్కీ ప్రస్తుతం భూమి పెడ్నేకర్ - కియారా అద్వానీతో కలిసి గోవింద నామ్ మేరాలో కనిపించనున్నారు. ఇది జూన్ 10న సినిమా హాళ్లలోకి రానుంది. ఇదే కాకుండా.. సారా అలీ ఖాన్ తో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న టైటిల్ నిర్ణయించని చిత్రంలోనూ నటిస్తున్నారు. తదుపరి మేఘనా గుల్జార్ `సామ్ బహదూర్`లో నటించనున్నారు. ఇది భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఆనంద్ తివారీ ట్రిప్తీ డిమ్రీ- అమీ విర్క్ లతో తదుపరి చిత్రం చేస్తారు. ఇంకా దీనికి టైటిల్ ను నిర్ణయించలేదు.
మరోవైపు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ చిత్రంలో కత్రినా నటించనుంది. తదుపరి యాక్షన్-థ్రిల్లర్ చిత్రం టైగర్ 3లో సల్మాన్ ఖాన్ - ఇమ్రాన్ హష్మీ సరసన నటించనుంది. ఈ చిత్రం 2023 ఈద్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇషాన్ ఖట్టర్- సిద్ధాంత్ చతుర్వేది లతో కలిసి ఫోన్ భూత్ లోనూ నటించింది. ప్రియాంక చోప్రా - అలియా భట్ లతో కలిసి ఫర్హాన్ అక్తర్ రోడ్ ట్రిప్ చిత్రం `జీ లే జరా`లోనూ కత్రినా కనిపించనుంది.