Begin typing your search above and press return to search.

ఆ హీరో ప్రేయసి కోసం లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడా...?

By:  Tupaki Desk   |   26 April 2020 10:46 AM GMT
ఆ హీరో ప్రేయసి కోసం లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడా...?
X
మనదేశంలో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఇళ్ళ‌ల్లో ఉండ‌డంతో స‌గం స‌మయాన్ని సోష‌ల్ మీడియాకే కేటాయిస్తున్నారు. అయితే ఈ సంద‌ర్భాల‌లో కొంద‌రు నిజ‌నిజాలు తెలుసుకోకుండా రూమ‌ర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్ లాక్‌ డౌన్‌ ఉల్లంఘించాడ‌ని.. ఈ క్ర‌మంలో ముంబై పోలీసులు స్టేష‌న్‌ కి తీసుకెళ్లిన‌ట్టు పుకార్లు షికారు చేశాయి. విక్కీ కౌశల్ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు బీ టౌన్ లో వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ చాలా సందర్భాల్లో కలిసి ప్రైవేట్ పార్టీలలో కనిపించడంతో ఈ పుకార్లు నిజమే అని అందరూ భవిస్తూ వస్తున్నారు. దీనికి తోడు వీరిరువురు ఎప్పుడు కూడా ఈ వార్తలను ఖండించలేదు. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ప్రియురాలు కత్రినా కైఫ్ కి దూరంగా ఉంటున్న విక్కీ కౌశల్... ఆమెను మీట్ అవడానికి లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి వెళ్లి పోలీసులతో దెబ్బలు తిన్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ పై స్పందించిన హీరో విక్కీ కౌశల్‌ నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదని.. నిబంధనలను అతిక్రమించి పోలీసులకు పట్టుబడ్డాడని సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను విక్కీ కొట్టిపారేశారు.

ఈ మేరకు ట్వీట్‌ చేసిన విక్కీ ‘రూల్స్ బ్రేక్ చేసానని.. పోలీసుల చేతిలో తన్నులు తిన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి రూమర్స్ నమ్మకండి. అవి అవాస్తవాలు. లాక్‌ డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయకండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ ని ముంబై పోలీసులకు ట్యాగ్‌ చేశాడు. వాస్తవానికి విక్కీ తన కుటుంబంతో ముంబైలో క్వారంటైన్‌లో ఉంటున్నారట. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అలుపెరగకుండా.. నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు విక్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇంట్లో సరదాగా వంటలు చేస్తున్న ఫోటోలను - సోదరుడు సన్నీ కౌశల్‌ సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో తరచుగా షేర్‌ చేస్తున్నారు. అలాగే కరోనా పోరుకు ప్రధానమంత్రి సహాయనిధికి - మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కలిపి కోటి రూపాయల విరాళం అందజేశారు.

ఇదిలా ఉండగా విక్కీ కౌశల్ గతేడాది 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో విక్కీ నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 'రాజీ' 'ఉరీ' 'మనమార్జియాన్' 'సంజు' 'లస్ట్ స్టోరీస్' సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. గతేడాది దెయ్యాల నేపథ్యంలో కరణ్ జోహార్ నిర్మించిన 'భూత్' అనే హారర్ సినిమాలో నటించిన విక్కీ వరుస సినిమాలతో అతనిప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్ ఉద్ధమ్ సింగ్ బయోపిక్ 'సర్దార్ ఉద్ధమ్ సింగ్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఉద్ధమ్ సింగ్ జలియన్ వాలా భాగ్ దుర్ఘటనలు బాధ్యుడైన డయ్యర్ మీద రివేంజ్ తీర్చుకొనే వర్గంలోని విప్లవకారుడు. ఇప్పుడు విక్కీ ఈ విప్లవకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ చిత్రానికి సుజీత్ సర్కార్ డైరెక్షన్ చేస్తుండగా రోనీ లాహిరి మరియు షీల్ కుమార్ లు నిర్మిస్తున్నారు.