Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ లో విక్కీ-క్యాట్ విహారం!

By:  Tupaki Desk   |   18 July 2022 12:30 PM GMT
వైట్ అండ్ వైట్ లో విక్కీ-క్యాట్ విహారం!
X
విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ భార్యా భ‌ర్త‌లు అయిన త‌ర్వాత చిలౌట్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌లేదు. పెళ్లికి ముందు త‌ర‌హాలోనే పెళ్లి త‌ర్వాత విహార యాత్ర‌ల్ని ఆస్వాదిస్తున్నారు. డిసెంబ‌ర్ లో పెళ్లి చేసుకున్న జంట అటుపై రెండు నెల‌లు పాటు బాల‌వుడ్ జ‌నాల‌కి క‌నిపించ‌కుండా విదేశాలు వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు విదేశాల్లో ఎంజాయ్ చేసి తిరిగొచ్చారు.

హనీమూన్ పేరిట ఈ రేంజ్లో ఇంత వ‌ర‌కూ ఏ జంట అన్ని రోజులు కేటాయించింది లేదు. ఆ ర‌కంగా విక్కీ-క్యాట్ అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యారు. అటుపై కొన్ని రోజుల పాటు మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యారు.

ఎవ‌రి సినిమా సెట్ కి వాళ్లు హాజ‌రై పెండింగ్ షూటింగ్ లు అన్నింటిని ఒక్కొక‌టిగా పూర్తి చేసారు. అయితే పెళ్లైన త‌ర్వాత ప్రియురాలి పుట్టిన రోజు వేడుక‌ల్ని హ‌బ్బీ ఎంతో ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

క‌త్రినా జులై 16వ తేదితో 39వ ప‌డిలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్బంగా బ‌ర్త్ డే ని ఏకంగా మ‌ల్దీవుల్లోనే సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మాల్దీవుల అందాల నుంచి ఓ ఫోటోని ఇన్ స్టా లో షేర్ చేసిందీ జంట‌. ఇందులో ఇద్ద‌రు వైట్ కల‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు. స‌ముద్రంలో బోట్ పై షికారు చేస్తోన్న ఫోటోని అభిమానుల‌కు షేర్ చేసి విష‌యాన్ని రివీల్ చేసారు.

పెళ్లైన త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి పుట్టిన రోజు కావ‌డంతో విక్కీ ఇలా స్పెష‌ల్ గా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు ప్రేమికురాలిగా ఉన్న‌ప్పుడు ల‌వ్ ప్ర‌పోజ‌ల్ - పెళ్లైన త‌ర్వాత ల‌వ్ యూ చెప్ప‌డం మ‌ధ్య వ్య‌త్యాసం చూపించే ఉంటాడు.

ఇక క‌త్రినా గ‌ర్బందాల్చిన‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ విష‌యాన్ని జంట ఇంకా క‌న్ప‌మ్ చేయ‌లేదుగానీ.. మీడియా మాత్రం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుంది. మ‌రి వీటిపై విక్కీ-క్యాట్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.