Begin typing your search above and press return to search.

నులివెచ్చ‌గా భోగి మంట కాగిన న‌వ‌ జంట‌

By:  Tupaki Desk   |   14 Jan 2022 6:12 AM GMT
నులివెచ్చ‌గా భోగి మంట కాగిన న‌వ‌ జంట‌
X
క‌త్రినా కైఫ్-విక్కీ కౌశ‌ల్ ఇటీవ‌లే వివాహ బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. రెండున్న‌రేళ్ల‌ పాటు ఘాడ‌మైన‌ ప్రేమ‌లో మునిగి తేలిన ఈ జంట కొత్త‌ జీవితంలో స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధిస్తున్నారు. తాజాగా ఈ న‌వ దంప‌తులు త‌మ మొద‌టి లోహ్రీ పండుగ‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నారు. పెళ్లైన త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి పండుగ కావ‌డంతో దంప‌తులు ఇద్ద‌రు సంతోషంగా వేడుక‌ల్లో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. లోహ్రీ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా వేసిన మంట‌లో ఈ జంట చ‌లి కాగుతున్నారు. దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ఈ జంట వేకువ జామునే ఇద్ద‌రూ త‌ల‌స్నానాలు చేసుకుని ఇలా ఎర్లీమార్నింగ్ మూవ్ మెంట్స్ ని ఆస్వాదిస్తున్నారు.

ఇందులో క‌త్రినా కైఫ్ సంప్ర‌దాయ ఎరుపు రంగు సూట్ తో పాటు వెచ్చ‌ని జాకెట్ ధ‌రించారు.విక్కీ కౌశ‌ల్ ష‌ర్ట్ ..ఫ్యాంట్ .. వింట‌ర్ కోట్ ధ‌రించారు. ఒక ఫోటోలో ఇద్ద‌రు ద్గ్గ‌ర ఉన్నారు. ఆ స‌మ‌యంలో విక్కీ కౌశ‌ల్ -భార్య‌పై చేయి వేసి న‌వ్వుతూ క‌నిపించారు. మ‌రొక ఫోటోలో ఇద్ద‌రు ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకుంటూ ప్రేమ‌ను కురిపించుకుంటున్నారు. స‌రిగ్గా ఈ లొకేష‌న్ స‌ముద్రానికి ఎదురుగా ఉంది. ఈ జంట ఉంటోన్న అపార్ట్ మెంట్ లోనే మొద‌టి లోహ్రీని జ‌రుపుకున్నారు. లోహ్రీ అనేది జాన‌ప‌ద పండుగ‌. శీతాకాలం ముగింపు స‌మ‌యంలో ఉత్త‌రాది ప్ర‌జ‌లు ఎంతో గ్రాండ్ గా జ‌రుపుకుంటున్నారు.

స‌రిగ్గా ఈ పండుగ మ‌న సంక్రాంతి ముందు రోజు వ‌చ్చే భోగి పండుగ లాగే ఉంటుంది. తెల్ల‌వారు జామునే క‌ట్టెల‌తో భారీ గా మంట వేయ‌డం... ఆ మంట చుట్టూ మ‌నుషులు ఉన్న వాతావ‌ర‌ణం చూస్తుంటే భోగి పండ‌గే అనిపిస్తోంది. ఇక ఈ జంట సినిమాల విష‌యానికి వ‌స్తే కత్రినా కైఫ్ -స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `టైగ‌ర్-3` లో న‌టిస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు క‌మిట్ అయింది. విక్ఈ కౌశ‌ల్ న‌టుడిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ఇటీవ‌లే ఉన్ని ముకుంద‌న్ బ‌యోపిక్ తో హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.