Begin typing your search above and press return to search.
పవన్ రీమేక్ కి వెరైటీ టైటిల్ పెట్టారు
By: Tupaki Desk | 8 Jun 2019 2:30 PM GMTపవన్ కళ్యాణ్ ఎంతో మోజు పడి చేసిన కాటమరాయుడు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అభిమానులు మర్చిపోలేరు. అజిత్ సూపర్ హిట్ మూవీ వీరంను యధాతధంగా తీసుకుని చేసినా ఫలితం దక్కలేదు. కోలీవుడ్ లో రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్తోంది. గతంలో అక్షయ్ కుమార్ హీరోగా తీయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఫైనల్ గా అవి కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి కాని హీరో మారాడు. యుఆర్ ఐతో ఈ ఏడాది ప్రారంభంలో సంచలన విజయం సొంతం చేసుకున్న విక్కీ కౌశల్ తో దీన్ని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫర్హాద్ శామ్జి దర్శకత్వం వహించే ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. అదే LOL. అంటే లాండ్ అఫ్ లుంగీస్. సినిమాలో పాత్రధారులు అందరూ పంచెలతో కనిపించేలా కథను తీర్చిదిద్దారట. పంచెలు కట్టుకున్న భూమి మీద హీరో బ్యాచ్ చేసే విన్యాసాలతో ఇది ఉంటుందన్న మాట.
కథలో మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని కామెడీ ఎక్కువగా ఉండేలా కీలకమైన మార్పులు చేసుకుని షూటింగ్ కు వెళ్ళబోతున్నట్టు తెలిసింది. హీరొయిన్ ఫైనల్ కావాల్సిన ఈ ల్యాండ్ అఫ్ లుంగీస్ టైటిల్ వినగానే నవ్వొస్తోంది కాని మళ్ళి మనోభావాలు దెబ్బ తిన్నయంటూ ఏ అరవ సోదరులో కేరళ మిత్రులో రారు కదా. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా దీనికి పెట్టుబడులు పెడుతుండటం విశేషం. కొసమెరుపు ఏంటంటే పవన్ కాటమరాయుడు డబ్బింగ్ వెర్షన్ ఇప్పటికే యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం