Begin typing your search above and press return to search.
కత్రినాతో రిలేషన్ ఎలా మొదలైందో రివీల్ చేసిన విక్కీ
By: Tupaki Desk | 19 Aug 2022 2:30 AM GMTమోస్ట్ పాపులర్ షోలలో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. దీని పుణ్యమా అని ప్రముఖులకు సంబంధించిన సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల మొదలైన షోలో.. పలువురు అతిధులు పాల్గొనటం.. వారు వెల్లడించిన వివరాలు బోలెడంత బజ్ కు కారణమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలో విక్కీ కౌశల్ .. సిద్ధార్ధ్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్కీకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందని చెప్పాలి. కారణం.. తన ముద్దుల భార్య కత్రినా కైఫ్ కు సంబంధించిన విషయాలు బయటకు వెల్లడి కావటమే.
ఈ షోలో వ్యాఖ్యతగా వ్యవహరించే కరణ్ జోహార్ మాట్లాడుతూ.. విక్కీ తొలిసారి షోకు వచ్చినప్పుడు కత్రినాకు నువ్వుంటే ఇష్టమని తెలుసుకున్నావు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకొని మళ్లీ షోకు వచ్చావు.. నువ్వు క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను మాత్రం మీ లవ్ స్టోరీకి పూర్తి క్రెడిట్ తీసుకుంటున్నా.. నా వల్లే మీ మధ్య రిలేషన్ ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి విక్కీ స్పందిస్తూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అవన్నీ అతగాడి మాటల్లోనే చూస్తే.
"మా మధ్య రిలేషన్ షురూ కావటానికి కారణం మీరే. ఓసారి కత్రినా ఈ షోలో పాల్గొన్నప్పుడు నా గురించి మాట్లాడింది. తనకు జోడీగా నేనుంటే చూడచక్కగా ఉంటుందని చెప్పింది.ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల తర్వాత మీ కారణంగానే తెలిశాయి. తను నా గురించి ఆలోచిస్తుందని తెలిసి ఎంతో హ్యాపీగా ఫీలయ్యా'' అని చెప్పారు.
తర్వాత కొంతకాలానికి జోయా అక్తర్ వాళ్లింట్లో జరిగిన ఫంక్షన్ లో తామిద్దరం తొలిసారి కలుసుకున్నామని.. అలా తమ మధ్య బంధం మొదలైందన్నారు. 'మా పెళ్లికి అందరిని పిలవాలని అనుకున్నాం. కాకుంటే అప్పట్లో సాధ్యం కాలేదు. అందుకు మేమిద్దరం చాలా బాధ పడ్డాం. పెళ్లి వేళ సోషల్ మీడియాలో హడావుడి చూసి నవ్వుకున్నాం. పెళ్లి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్స్ ను మేం పేల్చేశామని వచ్చిన వార్తల్ని చూసి.. పెళ్లి కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని పంతులుగారిని కోరాం' అని నవ్వేశారు.
తన గురించి.. కత్రినా గురించి పలు విషయాల్ని చెప్పుకొచ్చిన విక్కీ.. "మా ఇద్దరిలో తనే రొమాంటిక్. తను చాలా మంచి మనసున్న అమ్మాయి. నా భార్యగా రావటం నా లక్. ఆమె నుంచి నేను ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. నా గురించి నేను తెలుసుకోవాల్సిన ఎన్నో కఠినమైన వాస్తవాల్ని.. ఎలాంటి మొహమాటం లేకుండా తను చెప్పేస్తుంది.
మా ఇద్దరికి సరిగా వంట రాదు. తన కంటే నాకే పిల్లలంటే ఎక్కువ ఇష్టం. బట్టలు సర్దుకునే విషయంలో పెళ్లి తర్వాత మేమిద్దరం బాగా గొడవపడ్డాం. తనకు గది మొత్తం తీసేసుకొని.. నాకు మాత్రం ఒక చిన్న అల్మారా మాత్రమే ఇచ్చింది'' అంటూ తమ వైవాహిక జీవితంలోని విశేషాల్ని చెప్పుకొచ్చాడు.