Begin typing your search above and press return to search.

విక్ట‌రీ వెంక‌టేష్‌ 75.. సైంధ‌వ్‌!

By:  Tupaki Desk   |   25 Jan 2023 11:47 AM GMT
విక్ట‌రీ వెంక‌టేష్‌ 75.. సైంధ‌వ్‌!
X
విక్ట‌రీ వెంక‌టేష్ సీరియ‌స్ యాక్ష‌న్ సినిమాలు చేస్తూనే మ‌ధ్య మ‌ద్య‌లో భిన్నంగా సాగే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లు చేస్తూ వెళుతున్నారు. ఆ మ‌ధ్య 'నార‌ప్ప‌'తో శివాలెత్తిచ్చిన వెంకటేష్ ఆ త‌రువాత 'ఎఫ్ 3' అంటూ కామెడీ ఫార్ములా సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్ టైన్ చేసిన విష‌యం తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ మార్చి సినిమాలు చేస్తూ వ‌రుస స‌క్సెస్ ల‌ని ద‌క్కించుకుంటున్నారు. ప్ర‌స్తుతం త‌న కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచే 75వ ప్రాజెక్ట్ లో న‌టిస్తున్నారు.

గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విక్టరీ వెంక‌టేష్ హీరోగా ఆయ‌న 75వ మూవీకి 'హిట్‌' సిరీస్ చిత్రాల ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ బోయినప‌ల్లి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో చిత్ర బృందం బుధ‌వారం ఈ మూవీ టైటిల్ ని ప్ర‌క‌టిస్తూ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది.

ఈ చిత్రానికి 'సైంధ‌వ్‌' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. వెంక‌టేష్ నుంచి మాసీవ్ యాక్ష‌న్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల‌కు ఇదొక ట్రీట్ లా వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. గెట్ రెడీ ఫోక్స్ అంటూ రీసెంట్ గా ప్రీ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ బుధ‌వారం గ్లిమ్స్ ని విడుద‌ల చేయ‌డం విశేషం.

సౌత్ ఇండియాలోని పోర్ట్ సిటీ చంద్ర ప్ర‌స్త లోని పోర్ట్ లో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ని గ్లిమ్స్ లో చూపిస్తూ త‌న క్యారెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేశారు. పోర్ట్ ఏరియాలో వున్న కంటైన‌ర్ ల మ‌ధ్య దేని కోస‌మో వెతుకుతూ చేతిలో ఏకే 47 గ‌న్ ని ప‌ట్టుకుని మ‌రో చేతిలో క్యాప్సిల్ ని ప‌ట్టుకుని వెంకీ క‌నిపిస్తున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. 'నేనిక్క‌డే వుంటాన్రా..ఎక్క‌డికి వెళ్ల‌ను..ర‌మ్మ‌ను..' అంటూ త‌న ముందు గుట్ట‌గా ప‌డివున్న విల‌న్ బ్యాచ్ ని ఉద్దేశించి వెంక‌టేష్ చెబుతున్న డైలాగ్ లు ఆస‌క్తిక‌రంగా వున్నాయి.

బ‌దాస్ లుక్ లో గ‌డ్డంతో టెర్రిఫిక్ లుక్ లో వెంకీ క‌నిపిస్తున్న తీరు, ఆయ‌న పాత్ర మేకోవ‌ర్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. మెడిక‌ల్ మాఫియా నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌త హిట్ సిరీస్ ల‌కు పూర్తి భిన్నంగా ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను డిజైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వెంక‌టేష్ 75వ ప్రాజెక్ట్ కావ‌డంతో ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా రివీల్ కాని ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం, ఎస్‌, మ‌ణికండ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.