Begin typing your search above and press return to search.

వీడియో: మ‌లైకా జీవితంలో ఒక రోజు షూట్ డే ఇలా..!

By:  Tupaki Desk   |   21 July 2022 3:07 PM GMT
వీడియో: మ‌లైకా జీవితంలో ఒక రోజు షూట్ డే ఇలా..!
X
బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా.. డ్యాన్సింగ్ క్వీన్ మలైకా అరోరా ఇన్ స్టాగ్రామ్ టైమ్ లైన్ ఎప్పుడూ ఒక జాలీ వీడియోల‌కు బెట‌ర్ ప్లేస్. నిరంత‌రం ఆకర్షణీయమైన ఫోటో షూట్ లు .. ఫిట్ నెస్ వీడియోల తో నిండి ఉంటుంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో స‌ర‌దా జీవితాన్ని మలైకా సోషల్ మీడియాలో లైవ్ లీగా వాస్తవంగా ఉంచడానికి ఇష్టపడుతుంది.  సరదా వ్యాప‌కాలు ఒక‌ వైపు.. గ్లామ‌ర్ షోలు మ‌రో వైపు కుర్ర‌కారుకు ఊపిరాడ‌నివ్వ‌వు.

తాజాగా అలాంటి ఒక వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. మ‌లైకా అలా కార్ దిగి ఎంతో స్టైలిష్ గా న‌డుచుకుంటూ వచ్చి లిఫ్ట్ గుండా త‌న షూట్ ప్ర‌దేశానికి వెళుతోంది.  అక్క‌డ షూటింగ్ కోసం మొత్తం సెట‌ప్ సిద్ధంగా ఉంది. మేక‌ప్ మేన్.. కెమెరా డిపార్ట్ మెంట్ హ‌డావుడిగా ఉంది. స్టైలిష్ డ‌ఫెల్ చినుగుల జీన్స్ కి కాంబినేష‌న్ టాప్ ని ధ‌రించిన‌ మ‌లైకా అందాలు జిగేల్ మంటూ మెరిపిస్తున్నాయి. ఇది ఓ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన షూట్. మ‌లైకా జీవితంలో ఒక రోజు షూట్ డే ఇలా గ‌డిచింది.

మ‌రోవైపు గాళ్స్ గ్యాంగ్ తో క‌లిసి మ‌లైకా ర‌చ్చ‌కు సంబంధించిన ఫోటోషూట్ కూడా ఇంత‌కుముందు షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. మోడల్ కం ఎంట్రప్రెన్యూర్ మ‌లైకా ఇన్ స్టా స్టోరీస్ లో సరదా వీడియోలు అభిమానుల్లోకి దూసుకెళుతున్నాయి. మలైకా ముంబయిలోని ఒక కేఫ్ లో స్నేహితులు డెల్నాజ్ దారువాలా.. వహ్బిజ్ మెహతా ... నటి డాక్టర్ అదితి గోవిత్రికర్ తో కలిసి కరోకే సెషన్ ను ఆస్వాధిస్తూ కనిపించింది.

ఈ వీడియోలలో గాళ్స్ గ్యాంగ్ 1958 క్లాసిక్ హిట్ ఓహ్! నీల్ సెడకాచే కరోల్ లో డ్యాన్సులాడారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోను షేర్ చేస్తూ, మలైకా అరోరా “#Sistersledge in house.” అని రాసారు. ఇటీవల మలైకా అరోరా తన స్నేహితులు డెల్నాజ్ దారువాలా- వహ్బిజ్ మెహతా- ప్రెస్సీ నాథన్ లతో కలిసి మరో సరదా రీల్ ను రిలీజ్ చేసారు. క్యాప్షన్ లో ``నా గర్ల్స్ తో సండే పిచ్చిగా`` అని ఫ‌న్ నోట్ ని షేర్ చేసింది.

ఇంకాస్త  ఫ్లాష్ బ్యాక్ కి వెళితే.. మలైకా అరోరా  త‌న బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో మ్యాచింగ్ డ్రెస్ తో ఒక అవార్డుల కార్యక్రమంలో క‌నిపించింది. పవర్ సూట్ లను ధరించి హ్యాపీ కపుల్ ఎప్పటిలాగే గ్లామరస్ గా కనిపించారు. దీనికి ముందు మలైకా అరోరా మరొక అవార్డుల కార్యక్రమం నుంచి డిజైన‌ర్ లుక్ తో వీడియోను షేర్ చేసింది. గ్లామరస్ గా కనిపించే ప్రయత్నంపై మాట్లాడుతూ... ఏదైనా అందంగా క‌నిపించేలా చేయడానికి తెరవెనుక చాలా కృషి చేయాలి అని తెలిపింది.  దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డులలో అవార్డు గ్రహీతలలో భాగమైనందుకు గౌరవంగా ఉంద‌ని మ‌లైకా అంది.

మలైకా అరోరా గతంలో ఫిల్మ్ మేకర్ అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నారు. ప్ర‌స్తుతం యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో మ‌లైకా స‌హ‌జీవ‌నంలో ఉన్నారు.