Begin typing your search above and press return to search.

వీడియో: న‌ట‌వారసురాలు డ్యాన్సింగ్ త‌డాఖా

By:  Tupaki Desk   |   29 July 2022 2:30 AM GMT
వీడియో: న‌ట‌వారసురాలు డ్యాన్సింగ్ త‌డాఖా
X
బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వారసులు ప‌రిచ‌య‌మవుతున్న సంగ‌తి తెలిసిందే. నేటిత‌రంలో జాన్వీ క‌పూర్- సారా అలీఖాన్- అన‌న్య పాండే త‌ర‌హాలోనే మ‌రో న‌ట‌వార‌సురాలు బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. ప్ర‌ముఖ న‌టి పూజా భేడీ న‌టవార‌సురాలు యువ‌నాయిక ఆలయ.ఎఫ్ ఇటీవ‌లే బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే గ‌ట్స్ ఉన్న న‌టి అని నిరూపించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది.

ఇత‌ర నాయిక‌ల్లానే ఆల‌య కూడా సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం స్పీడ్ గా ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ వీడియోలు ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల్ని ఇన్ స్టాలో యంగేజ్ చేస్తోంది. అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ .. ఈవెంట్ అప్పియరెన్స్ ప‌రంగా ఆల‌య సూప‌ర్ స్పెష‌ల్ లుక్స్ ఇప్ప‌టికే యూత్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ బ్యూటీ తరచుగా తన యోగా వీడియోలు డ్యాన్స్ కొరియోగ్రఫీ వీడియోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది.

తాజా వీడియోలో ఆల‌య ఓ ట్రెండీ సాంగ్ కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది. పాట‌లో పెప్ కి త‌గ్గ‌ట్టే బ్లాక్ క‌ల‌ర్ బ్రాలెట్ .. సౌకర్యవంతమైన ప్యాంటులో ఆల‌య అద్భుత‌మైన డ్యాన్సింగ్ మూవ్స్ తో కిల్ చేసింది. యాష్క్ ఆడ‌మ్ తో వేగంగా డ్యాన్సుల‌ను నేర్చుకోవ‌డం సులువు అంటూ రాసింది ఆల‌య‌. వీడియోలో త‌న కొరియోగ్రాఫ‌ర్ కూడా క‌నిపిస్తున్నారు.

రసో బ్రదర్స్ అతిథులుగా `ది గ్రే మ్యాన్` ప్రీమియర్ ఇటీవ‌లే ముంబైలో ప్ర‌ముఖుల కోసం ఏర్పాటు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. సారా అలీఖాన్ స‌హా ప‌లువురితో ఆలయ ఎఫ్ ఈ ప్రీమియ‌ర్ స్పాట్ కి వ‌చ్చింది. అక్క‌డ అల్ట్రా పోష్ లుక్ తో అద‌ర‌గొట్టింది. ఆ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆలయ ఎఫ్ జ‌వానీ జానేమాన్ చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. త‌దుప‌రి ఏక్తా కపూర్ నిర్మిస్తున్న‌ `యు-టర్న్`... కార్తిక్ ఆర్యన్ తో `ఫ్రెడ్డీ` చిత్రాల్లో న‌టిస్తోంది. మరిన్ని ప్రాజెక్టుల వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది