Begin typing your search above and press return to search.

అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 8:34 AM GMT
అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
X
అలీ ఎంతగా కష్టాలు పడుతూ .. ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చాడనేది అందరికీ తెలిసిందే. బాలనటుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటివరకూ కొనసాగుతూనే వచ్చింది. అల్లు రామలింగయ్య .. రాజబాబు వంటి సీనియర్ స్టార్ కమెడియన్స్ తో కలిసి నటించిన అనుభవం ఆయన సొంతం. అలాంటి అలీ అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ అనిపించుకున్నాడు. ఆ తరువాత హీరోగా చేస్తూ కూడా ఆయన కమెడియన్ గా ప్రేక్షకులకు దూరం కాకుండా చూసుకున్నాడు.

ఒకానొక సమయంలో బ్రహ్మానందం .. ఎమ్మెస్ .. ధర్మవరపు .. ఏవీఎస్ .. సునీల్ .. కృష్ణభగవాన్ .. వేణు మాధవ్ .. ఇలా ఎక్కువమంది కమెడియన్స్ తో తెలుగు తెర కిటకిటలాడి పోతున్నప్పుడు కూడా ఆలీకి రావలసిన అవకాశాలు ఆయనకి వచ్చాయి. అలాంటి అలీ ఈ మధ్య సినిమాల సంఖ్యను తగ్గించుకుని, బుల్లి తెరపైనే బిజీగా ఉన్నాడు. అలీ తెరపై కమెడియన్ గా కనిపించినప్పటికీ, టాలీవుడ్ శ్రీమంతులలో ఆయన ఒకరుగా కనిపిస్తాడు. తన పిల్లల చదువు విషయంలో కూడా ఆయనను అభినందించకుండా ఉండలేం.

అలీ తన పిల్లలలను సెలబ్రిటీ పిల్లల మాదిరిగా కాకుండా కష్టం తెలిసేలా పెంచాడని ఇండస్ట్రీలో చెప్పుకునేవారు. అలా తన కష్టం ఫలించి పెద్దమ్మాయి ఫాతిమా డాక్టర్ చదువును పూర్తి చేసిందంటూ ఆ ఆనందాన్ని ఇటీవల ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఫాతిమాకి పెళ్లి చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఎంగేజ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం .. సాయికుమార్ వంటి అతిథులతో ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగిందనే విషయం ఫొటోలను చూస్తుంటే అర్థమవుతోంది.

ఇంతకీ అలీ అల్లుడు ఏం చేస్తూ ఉంటాడు అనే ఆసక్తి అందరిలో తలెత్తడం సహజం. అలీ అల్లుడు డాక్టర్ .. అతని ఫ్యామిలీని వాళ్లంతా డాక్టర్ లేనట. తన కూతురు కూడా మెడిసిన్ పూర్తి చేయడం వలన, అలీ ఈ సంబంధాన్ని ఖాయం చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి త్వరలోనే అలీ ఇంట పెళ్లి సందడి మొదలవ్వనుందన్న మాట.