Begin typing your search above and press return to search.
హలో వరల్డ్ : క్రేజీ బ్యాచ్ సాఫ్ట్ వేర్ కష్టాలు!
By: Tupaki Desk | 30 July 2022 12:55 PM GMTపింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆసక్తికరమైన కథలతో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నిర్మించిన `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` జీ5లో స్ట్రీమింగ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేసిన నిహారిక అదే ఉత్సాహంతో మరో విభిన్నమైన వెబ్ డ్రామాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. తను నిర్మించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ `హలో వరల్డ్`. ఈ సీరీస్ తో హీరోయిన్ సదా, ఆర్యన్ రాజేష్ ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.
జలదంకి శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ డ్రామాలోని ఇతర పాత్రల్లో రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యాశెట్టి, నిఖిల్, అపూర్వరావు, `మై విలేజ్ షో ` అనిల్, స్నేహాల్, రవివర్మ, జయ ప్రకాష్ నటించారు.
స్టడీ అయిపోయింది.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిందని హ్యాపీగా ఫీలైన ఎనిమిది మంది చుట్టూ సాగే సాఫ్ట్ వేర్ డ్రామాగా ఈ సీరీస్ ని రూపొందించారు. సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరిన తరువాత ఫ్రెషర్స్ కష్టాలు ఎలా మొదలయ్యాయి?.. వాటిని ఎలా ఫేస్ చేశారు అన్నది ఇందులో ప్రధాన కథ.
ఈ సిరీస్ లోని పాత్రలని పరిచయం చేస్తూ `పే హలో టు అవర్ ఇంటర్న్స్ పేరుతో ఓ వీడియోని శనివారం హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఫ్రెష్ టాలెంట్ తో కూపొందిన హలో గ్యాంగ్ కు హలో చెప్పండి. వీళ్లు క్రాక్ చేసే కోడ్ లని చూడటానికి వేచి వుండలేరు. ఆగస్టు 12 నుంచి ఈ వెబ్ డ్రామా జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది`అని ట్వీట్ చేశారు.
పల్లెటూరి నుంచి సాఫ్ట్ వేర్ జాబ్ కోసం పట్నం వచ్చే యువకుడు సురేష్, కూల్ గయ్ గా సిద్దు, జాబ్ రాదని తెలిసి ఎగ్జామ్ రాసి జాబ్ రావడంతో షాక్ గురయ్యే వరుణ్.. ఇంట్లో వాళ్లు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే జాబ్ కోసం ప్రయత్నించే మేఘన, ఐటీ యంగ్ కపుల్ రాహుల్ , వర్ష, కాలేజ్ ఛాంపియన్ అమ్ము. వీళ్లందరికి సాఫ్ట్ వేర్ క్లాసులు చెప్పే రాఘవ్.. చిన్న విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకునే ప్రవల్లిక.. వీళ్లందరికీ సపోర్ట్ గా నిలిచే ప్రవల్లికల పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. సాప్ట్ వేర్ వకల్డ్ లోకి కొత్తగా ఎంటరైన ఫ్రెషర్స్ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఆత్యంతం వినోద భరితంగా ఈ సిరీస్ ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. జీ5లో ఆగస్టు 12 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.