Begin typing your search above and press return to search.

వీడియో: అక్క‌లిద్ద‌రితో మెగా ప్రిన్సెస్ జాలీగా

By:  Tupaki Desk   |   18 July 2022 5:33 PM GMT
వీడియో: అక్క‌లిద్ద‌రితో మెగా ప్రిన్సెస్ జాలీగా
X
సంక్రాంతి .. ద‌స‌రా.. దీపావ‌ళి వంటి పండ‌గ‌లు.. రాఖీ వంటి గొప్ప సంద‌ర్భంలో మెగా ఫ్యామిలీలో అంతా ఒక వేదిక‌పై క‌లుసుకుంటార‌న్న‌ది తెలిసిందే. ఈ బిజీ లైఫ్ లో పండ‌గ‌లు ప‌బ్బాల‌కు అయినా కుటుంబం అంతా ఒక చోట క‌లిసి బంధాలు అనుబంధాల‌ను కాపాడుకోవాల‌నే మెగా ప్ర‌య‌త్న‌మిది. ఇది మెగాభిమానులు స‌హా ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపుతుంది.

మెగా యువ‌హీరోలంతా నిరంత‌రం వీకెండ్స్ లో పార్టీల పేరుతో క‌లుస్తుంటారు. ఇంత‌కుముందు చిరు దోసెల కోసం మెగా అల్లుళ్లు అబ్బాయిలు క్యూలో ప్లేట్స్ ప‌ట్టుకుని ఒక చోట క‌నిపించారు. ఇక మెగా సిస్ట‌ర్స్ అంతా ఒక చోట చేరి సంద‌డి చేయ‌డం కూడా అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు రివీల‌వుతోంది.

తాజాగా నిహారిక కొణిదెల షేర్ చేసిన ఒక వీడియో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. అక్క‌జెల్లెళ్ల చ‌క్క‌ని అనుబంధానికి ప్ర‌తీక‌గా ఇది క‌నిపిస్తోంది. ఈ వీడియోలో నిహారిక త‌న అక్క‌లైన సుస్మిత‌- శ్రీ‌జ‌ల‌తో క‌లిసి నచ్చిన రెస్టారెంట్ లో ఫుడ్ ని ఆస్వాధించి అలా కార్ లో న‌గ‌రంలో జాలీగా షికార్ చేస్తోంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌కుముందు ముంబైలో నిహారిక నెట్ ఫ్లిక్స్ ఆఫీస్ లో ప్ర‌త్య‌క్ష‌మైన వీడియో కూడా వైర‌ల్ అయ్యింది. నిహారిక సాఫ్ట్ వేర్ ప్రొఫెష‌న‌ల్ చైత‌న్య‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాల‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు.

సుస్మిత సొంత బ్యాన‌ర్ లో సినిమాలు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తున్నారు. శ్రీ‌జ త‌న సోద‌రీమ‌ణుల‌కు .. నిర్మాత‌గా ఉన్న త‌న సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్ కి త‌న‌వంతు గా ప్రొడ‌క్ష‌న్ స‌హా ఇత‌ర వ్య‌వ‌హారాల్లో స‌హ‌కారం అందిస్తున్నారు.