Begin typing your search above and press return to search.

హీరో కోసం ఫ్యాన్స్ హైవే ఛేజ్

By:  Tupaki Desk   |   7 March 2019 5:22 AM GMT
హీరో కోసం ఫ్యాన్స్ హైవే ఛేజ్
X
ఏంటో సినిమా హీరోల మీద తమ అభిమానానికి ఫ్యాన్స్ క్రమంగా హద్దులు చెరిపేసుకుంటున్నారు. తమిళ తంబీలు ఈ విషయంలో మరీ అతిగా ఉంటారని గతంలో చాలా ఉదాహరణలు కళ్లారా చూసాం. ఇది కూడా అదే కోవలోకి చేరుతుంది. హీరో విజయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు తెలియంది కాదు. ఇక్కడ మార్కెట్ పెద్దగా లేదు కానీ చాలా యావరేజ్ సినిమాలతో కూడా ఈజీగా వంద కోట్లు రాబట్టడం ఒక్క విజయ్ కే చెల్లుతుంది.

కోట్లలో ఉన్న అభిమానుల వల్ల చిన్న టీజర్లు సైతం ప్రపంచ రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్య విజయ్ ఓ పెళ్లి వేడుకకు వెళ్తే జరిగిన తోపులాటలో కొందరు గాయపడి ఏకంగా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. దాని తర్వాతే విజయ్ ఇక బయటి ఫంక్షన్స్ కు రాకూడదని డిసైడ్ అయ్యాడు

తాజాగా విజయ్ ఓ షూటింగ్ నిమిత్తం చెన్నై నుంచి వేరే లొకేషన్ కు వేగంగా తన కారులో వెళ్తున్నాడు. ఎలా తెలుసుకున్నారో కానీ ఓ ఇద్దరు అభిమానులు విజయ్ కారును ఫాలో కావడం మొదలుపెట్టారు. క్రమంగా విజయ్ డ్రైవర్ వేగాన్ని 120 నుంచి 150 వైపు పరుగులు పెట్టించాడు. ఇది గమనించిన ఆ ఇద్దరు ఫాన్స్ అంతే స్పీడ్ తో బైక్ తో ఛేజింగ్ స్టార్ట్ చేసారు. గుర్తించడానికి విజయ్ కు ఎక్కువ సమయం పట్టలేదు.

వెంటనే కారు వేగాన్ని అమాంతం తగ్గించి విండో ద్వారా వాళ్లకు హితోపదేశం చేసి తన కోసం ఇలా అతి వేగంతో ప్రాణాలకు రిస్క్ చేసి ఇంట్లో వాళ్ళను బాధ పెట్టవద్దని కోరాడు. తనది స్పోర్ట్స్ కారని వేగంగా వెళ్లడం మాములే కానీ బైకుల మీద ఇంత స్పీడ్ తో ఛేజ్ చేయడం ప్రమాదమని క్లాస్ పీకాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఆపి మరీ మంచి చెప్పే హీరోలు ఎవరుంటారు అంటూ మళ్ళి మోసేస్తున్నారు విజయ్ ఫాన్స్.