Begin typing your search above and press return to search.
వీడియో: బుట్టబొమ్మ ఏంటమ్మీ ఈ ప్రచారం పిచ్చి?
By: Tupaki Desk | 3 Jan 2023 6:31 AM GMTఒకప్పుడు క్రికెట్ ని వంద కోట్ల మంది భారతీయులు ఎంతో మోజుపడి చూసేవారు. ఆ తర్వాత క్రికెట్ ఆటలో స్కామ్ లు కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాక ఈ చెత్త గేమ్ చూడకూడదని చాలామంది నిర్ణయించుకున్నారు. నేటితరం కంటే కాస్త ముందుకు వెళితే అప్పటి తరం టీవీల్లో క్రికెట్ చూస్తున్నారంటే కేవలం ఆ క్షణం రిలీఫ్ కోసమే తప్ప భారత క్రికెటర్లపై గౌరవంతో కాదు!! వరుస పెట్టి భారత క్రికెట్ టీమ్ తో ముడిపడిన స్కామ్ లు బయటకు రావడంతో ఈ ఆటంటేనే చాలామందికి నీరసం వచ్చింది. అయితే క్రికెట్ అనే మాయ ఇంకా నేటితరంపైనా టీనేజర్లపైనా బలంగా పని చేస్తోందని ఇటీవలి టెలివిజన్ వీక్షణలు టీఆర్పీలు చెబుతున్నాయి. గంటల కొద్దీ సమయం కైంకర్యం అయిపోయే ఈ ఆటవల్ల నేటితరానికి ఎంతటి విలువైన సమయం వృధా అవుతోందో కూడా కొన్ని బలమైన విశ్లేషణలు సాగుతున్నాయి.
క్రికెట్ పై మొహం మొత్తేసినట్టే ఇష్టానుసారం వాడేస్తున్న సోషల్ మీడియాపైనా మోజు తగ్గితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇప్పట్లో గ్లామర్ కి ఆకర్షితులయ్యే యూత్ ని టీనేజర్లను ఆపలేం కానీ కాస్త నడివయసు లేట్ ఏజ్ బాబులకు సోషల్ మీడియాపై యావగింపు పెరుగుతోందన్నది వాస్తవం.
ప్రతి చెత్త వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటే అది చూసేందుకు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటోంది నేటితరం. చాలా మంది కథానాయికలు ప్రతి చెత్తను ఇన్ స్టాలోకి తోసేస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ షేర్ చేసిన ఒక వీడియో అలానే ఉందని విమర్శలొస్తున్నాయి. సౌత్- నార్త్ ని ఏల్తూ కోట్లాది రూపాయల పారితోషికం అందుకునే పూజా హెగ్డే తన సంపాదనను మరింత పెంచుకునేందుకు ఇలాంటి చెత్త వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తోందంటూ ఒక వర్గం విమర్శిస్తోంది.
పూజా హెగ్డే నిరంతరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన జీవితంలో ప్రతి ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ ని అభిమానుల కోసం షేర్ చేస్తోంది. అయితే తను లేదా ఇతర టెంప్టింగ్ కథానాయికలు షేర్ చేసే కొన్ని చెత్త వీడియోలు మాత్రం అందరికీ టైమ్ వేస్ట్ అని ఆవేదన వ్యక్తమవుతోంది. అలాంటివి షేర్ చేయకుండా క్లాసీ అనిపించేవి గమ్మత్తయిన ఆకర్షణీయమైన మంచి క్రియేటివిటీ ఉన్న వీడియోలు లేదా ఫోటోలను మాత్రమే షేర్ చేస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు!
తాజాగా పూజా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో గోల్ఫ్ ఆడుతూ కనిపించింది. స్టేడియంలో గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నా! అంటూ బిల్డప్ ఇచ్చింది. ఈ పోస్ట్‌కి ''#vacay #firsttimegolfer .. చుట్టూ భయానకం.. కానీ బమ్మింగ్...'' అంటూ వ్యాఖ్యను జోడించింది. కొత్త సంవత్సరం వెకేషన్ కోసం వెళ్లినప్పుడు గోల్ఫ్ ని ఆస్వాధించడం తప్పు కాదు కానీ చెత్త వీడియోలతో యువతరం విలువైన సమయాన్ని వృధా చేయడం నేరం!
ఇలాంటి వీడియోల్లో మినిమం క్రియేటివిటీని అయినా కావాలని కోరుకుంటోంది యూత్. బుట్టబొమ్మ ప్రచారం పిచ్చిని తగ్గించుకోవాలని.. అన్ని చెత్త వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దని మనవి చేసుకుంటున్నారు! ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే తదుపరి మహేష్ సరసన త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తోంది. ఇకపై పూజా పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తే మంచిదని ఘట్టమనేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.