Begin typing your search above and press return to search.

స్టార్ హీరో షాకింగ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌

By:  Tupaki Desk   |   4 Feb 2022 1:57 PM GMT
స్టార్ హీరో షాకింగ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌
X
త‌మిళ స్టార్ హీరో శింబు షాకింగ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురిచేస్తోంది. గురువారం ఆయ‌న 39వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కోలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టి రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శింబు త‌న‌దైన టాలెంట్ తో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో కొన‌సాగుతున్నారు.

2011లో వ‌చ్చిన `ద‌బాంగ్‌` రీమేక్ `ఓస్తీ` లో సిక్స్ ప్యాక్ బాడీతో అద‌ర‌గొట్టిన శింబు కెరీర్‌కి ఆ త‌రువాతే ఎదురుదెబ్బ త‌గిలింది. వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటూ ఎఫైర్‌లు .. అన్ ప్రొఫెష‌న‌ల్ బిహేవియ‌ర్ కార‌ణంగా అత‌న్ని త‌మిళ నిర్మాత‌ల సంఘం నిషేధించింది. దీంతో నాలుగేళ్ల పాటు ఎలాంటి సినిమాలు లేకుండా కెరీర్ ప‌రంగా చాలా వెన‌క‌బ‌డిపోయాడు శింబు.

దీంతో చాలా బ‌రువు పెరిగిపోయాడు. 105 కిలోలు బ‌రువు పెర‌గి భారీ కాయంతో క‌నిపించి షాకిచ్చాడు. రెండేళ్ల క్రితం అంటే 2020 లాక్ డౌన్ పీరియ‌డ్ లో త‌న అహార‌పు అల‌వాట్ల‌తో పాటు త‌న ప‌ద్ద‌తులు అన్నింటినీ మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మ‌ళ్లీ పూర్త‌పు స్థితికి త‌న‌ని తాను పూర్తి ఫిట్ గా మార్చుకోవాల‌ని భావించాడు. ఈ విష‌యంలో అత‌నికి ఫిట్ నెస్ ట్రైన‌ర్ సందీప్ రాజ్ మంచి స‌హ‌కారాన్ని అందించారు.

ఈ ప్రాసెస్ లో శింబు ఏం చేశాడు? ఎలా త‌న‌ని తాను ఫిట్ గా మార్చుకున్నాడ‌నే విష‌యాల్ని తెలియ‌జేస్తూ `ది జ‌ర్నీ ఆఫ్ #ATMAN SilambarasanTR` పేరుతో తాజాగా 13:41 నిమిషాల నిడివిగ‌ల ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఈ వీడియోలో శింబు జ‌ర్నీ చాలా స్ఫూర్తి వంతంగా సాగింది. ఒకానొక సంద‌ర్భంలో త‌న‌ని తాను మార్చుకునే క్ర‌మంలో శింబు క‌ఠోరంగా శ్ర‌మిస్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ క‌దిలిస్తోంది. వ‌ర్క‌వుట్స్, స్విమ్మింగ్‌, జాగింగ్‌, బ్యాడ్మింట‌న్‌, మార్ష‌ల్ ఆర్ట్స్ , క‌త్తిసాము వంటి వి ఎన్నో చేశారు. అంతే కాకుండా అయ్య‌ప్ప దీక్ష‌ని కూడా పూనుకోవ‌డం, ఇరుముడి క‌ట్టుకుని అయ్య‌ప్ప స్వామి కోవెల‌కు చేరుకోవ‌డం వంటివి చేశారు.

105 కిలోల బ‌రువున్న శింబు అకుంఠిత దీక్ష‌తో త‌న‌ని తాను మార్చుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో క‌ఠోరంగా శ్ర‌మించి చివ‌రికి 71 కిలోల బ‌రువు త‌గ్గ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. గ‌తంలో ప్ర‌తీ రోజు బ‌ర్యానీ తింటూ ఊబ‌కాయుడిలా మారిన శింబు ఆ త‌రువాత స్ట్రిక్ట్ డైట్ ని పాటిస్తూ ఫైన‌ల్ గా 71 కిలోల‌కి త‌గ్గిపోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. శింబు షాకింగ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ జ‌ర్నీకి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.