Begin typing your search above and press return to search.

ముక్కు కత్తిరించుకొమన్నారు

By:  Tupaki Desk   |   2 Jan 2018 11:50 AM GMT
ముక్కు కత్తిరించుకొమన్నారు
X
సినిమాల్లో పాత్ర కోసం జుత్తు కత్తిరించుకోమనే దర్శకులు ఉన్నారు. బట్టలు ఇంకాస్తా కురచగా కట్ చేసుకోమనే డైరెక్టర్లు ఉంటారు. కాని ఒక సినిమా కోసం ఏకంగా ముక్కును కత్తిరించుకోమని ఒక దర్శకుడు హీరొయిన్ కు చెప్పడం మాత్రం ఇప్పటిదాకా అయితే వినలేదు. బాలీవుడ్ హీరొయిన్ విద్యా బాలన్ కు ఆ ముచ్చట జరిగిందట. నిర్మాత వినోద్ చోప్రా తనకు సినిమా ఆఫర్ ఇవ్వాలంటే ముక్కుని కత్తిరించుకోవడం కోసం లాస్ ఏంజిల్స్ కు స్వంత ఖర్చులు మీద పంపిస్తాను అన్నాడని, దీంతో వెంటనే భయపడిన తాను దర్శకుడు ప్రదీప్ సర్కార్ దగ్గరకు వెళ్లి ఇలా సినిమా ఛాన్స్ కోసం ముక్కుని రిపేర్ చేసే సమస్యే లేదని తేల్చి చెప్పిందట. ఇటీవలే ఒక ప్రమోషనల్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యా బాలన్ ఈ వ్యాఖ్యలు చేసింది.

పెదవులకు, ముక్కుకు, మొహానికి సర్జరీలు చేయించుకోవడం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కొత్తేమి కాదు. ఈ మధ్యే తెలుగులో ఇప్పుడిప్పుడే పైకొస్తున్న ఒక అప్ కమింగ్ హీరొయిన్ పెదవులకు చికిత్స చేయించుకుంటే అవి దొండపండులా ఉబ్బిపోయి తన మొహమే మారిపోయింది అనిపించేలా తయారయ్యింది. ఇటీవలే ఒక సినిమాలో, వెబ్ సిరీస్ లో తన లుక్ చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. విద్యా బాలన్ నో చెప్పి మంచి డెసిషన్ తీసుకుంది. ఇంతకూ ఈ ముచ్చట అంత ఏ సినిమా గురించి అనుకుంటున్నారా. 2005లో వచ్చిన పరిణీత సినిమాలో విద్యా బాలన్ టైటిల్ రోల్ పోషించగా సంజయ్ దత్ - సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటించారు. ఆ సినిమా గురించే విద్యా బాలన్ ఇప్పుడు గుర్తు చేసుకుంది.