Begin typing your search above and press return to search.
సావిత్రిగా తెలుగమ్మాయే దొరకలేదా?
By: Tupaki Desk | 27 July 2016 5:27 PM GMTమహానటి సావిత్రిపై సినిమా తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యంతో ఆకట్టుకున్న దర్శకుడ నాగ్ అశ్విన్.. సావిత్రిపై బయోపిక్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయిపోగా.. ఇప్పుడు కాస్టింగ్ పై దృష్టి పెట్టాడు దర్శకుడు.
సావిత్రి బయోపిక్ అనగానే.. మొదట వచ్చేది రావాల్సినది అయిన ఆలోచన.. సావిత్రిగా ఎవరు నటిస్తారు అనే? ఈ పాత్ర కోసం బాలీవుడ్ భామను అడగబోతున్నట్లు సమాచారం. డర్టీపిక్చర్ అంటూ సిల్మ్ స్మిత జీవితంపై తీసిన సినిమాలో యాక్ట్ చేసిన విద్యా బాలన్ నే.. సావిత్రిగా నటించాల్సిందిగా కోరబోతున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. దర్శకుడి విజన్ ని.. టేస్ట్ ని కాదనలేం కానీ.. సావిత్రిగా నటించేందుకు తెలుగమ్మాయే దొరకలేదా అన్నదే అసలు పాయింట్.
ఎంత బయోపిక్ తీసినా.. ఎంత మంచిని చూపించాలన్నా ఆ సినిమాకి కమర్షియల్ విలువలు తప్పవు. ఇప్పుడు విద్యాబాలన్ ని తెచ్చుకోవాలని ఈ దర్శకుడు అనుకోవడానికి రీజన్ అదే. వెతికితే తెలుగులో సావిత్రి పాత్రకు అమ్మాయి దొరక్కపోదు. కానీ కొత్తోళ్లనో చిన్నోళ్లనో పెట్టుకుని మార్కెట్ చేసుకోవడం కష్టం. అందుకే తెలుగు హీరోయిన్ ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన సావిత్రి పాత్రకు.. బాలీవుడ్ భామను తెచ్చుకోవాల్సి వస్తోంది. అంతా కమర్షియల్ ఫార్ములా మహిమ ప్లస్ ఖర్మ. అంతే.