Begin typing your search above and press return to search.

మహిళ గౌరవం దుస్తుల్లో చూడద్దు

By:  Tupaki Desk   |   5 Feb 2016 1:30 PM GMT
మహిళ గౌరవం దుస్తుల్లో చూడద్దు
X
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మహిళల గౌరవంపై నోరు విప్పింది. ఈ మధ్య బాగా హాట్ టాపిక్ అయిన మహిళల డ్రెసింగ్ అంశాన్ని ప్రస్తావిచింది ఈమె. యూత్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమంలో పాల్గొన్న విద్యాబాలన్.. మహిళలను ఎక్కడైనా గౌరవించాల్సిందేనని అభిప్రాయపడింది.

'ఇక్కడ మారాల్సింది మగవాళ్ల ఆలోచనే. అమ్మాయిలు వారికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం, ఆమె వేసుకున్న డ్రస్ ను బట్టి ఉండకూడదు. ఆమె అలా డ్రస్ చేసుకోవడానికి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, ఉద్యోగం కూడా కారణం కావచ్చు. యాక్టర్స్ అయినా సరే, ఎక్స్ పోజింగ్ చేస్తున్నారని గౌరవం ఇవ్వకుండా ఉంటారా' అని ప్రశ్నించింది విద్యాబాలన్. తాను డర్టీపిక్చర్ లో తాను చాలా బోల్డ్ కేరక్టర్ చేశానని.. అందాల ప్రదర్శన, ఎక్స్ పోజింగ్ అన్నీ శృతి మించే ఉంటాయని.. అయినా సరే అవేమీ తన నిజమైన కేరక్టర్ కాదు కదా అంటూ వివరణ ఇచ్చింది ఈ హీరోయిన్.

దేశంలో ప్రతీ చోటా ఈవ్ టీజింగ్ జరుగుతోందన్న విద్యా బాలన్.. కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అంతే అనింది. అమ్మాయిల భయపడకుండా జీవించాలని... అలాగే తమ సొంత కాళ్లపై నిలబడే ఆర్థిక స్వాతంత్య్రం కూడా చాలా ముఖ్యమని హితబోధ చేసేసింది. ప్రతీ రంగంలోనూ అబ్బాయిలతో సమానంగా ఎదిగేందుకు అమ్మాయిలకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది విద్యాబాలన్.