Begin typing your search above and press return to search.

ఆ సినిమాను పాకిస్థాన్ లో ఆపేశారు

By:  Tupaki Desk   |   15 April 2017 6:38 AM GMT
ఆ సినిమాను పాకిస్థాన్ లో ఆపేశారు
X
మన హిందీ సినిమాలకు పాకిస్థాన్ లో మంచి మార్కెట్టే ఉంది. మంచి క్వాలిటీతో రూపొందే ఇక్కడి సినిమాలకు అక్కడ బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా ఖాన్ హీరోల సినిమాలు అక్కడ దుమ్ముదులుపుతుంటాయి. మంచి కంటెంట్ ఉన్న వేరే సినిమాలు కూడా బాగానే ఆడుతుంటాయి. కాకపోతే దేశభక్తి నేపథ్యంలో.. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఉండే సినిమాల్ని వాళ్లు అనుమతించరు. ఈ మధ్య అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’లో భారత జాతీయ గీతం ఉందని.. దాన్ని కట్ చేసి సినిమాను నడిపించాలని ఆదేశించింది అక్కడి సెన్సార్ బోర్డు. కానీ అందుకు అమీర్ ఖాన్ ఒప్పుకోకపోవడంతో ‘దంగల్’ విడుదలకు నోచుకోలేదు.

ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీకి పాకిస్థాన్ సెన్సార్ బోర్డే అడ్డుకట్ట వేసింది. ఆ ఆ సినిమా.. బేగం జాన్. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన ఈ సినిమాను పాకిస్థాన్లో ఆడించేందుకు అనుమతి ఇవ్వలేదు పాక్ సెన్సార్ బోర్డు. దేశ విభజన నాటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడమే కారణం. విభజన కారణంగా తన నేతృత్వంలో సాగే వేశ్యావాటికను ఖాళీ చేయించడానికి వచ్చిన అధికారులపై యుద్ధానికి దిగే పాత్రలో నటించింది విద్యా బాలన్. ఈ సినిమాలో పాకిస్థాన్ కు వ్యతిరేకమైన అంశాలేమీ లేకపోయినా పాక్ సెన్సార్ బోర్డు తమ సినిమాను అడ్డుకోవడం బాధాకరమని మహేష్ భట్ అన్నాడు. ఈ శుక్రవారమే విడుదలైన ‘బేగం జాన్’కు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత ఏడాది భారత్-పాకిస్థాన్ సంబంధాలు దెబ్బ తిన్న సమయంలో పాకిస్థాన్లో బాలీవుడ్ సినిమాలపై నిషేధం పడింది. ఈ మధ్యనే ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/