Begin typing your search above and press return to search.
శకుంతలాదేవి తర్వాత మరో ఛాలెంజింగ్ బయోపిక్
By: Tupaki Desk | 13 Aug 2020 5:30 AM GMTబాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి విద్యాబాలన్ వరుసగా ఛాలెంజింగ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో నటించి మెప్పించారు. తెలుగింటి సాంప్రదాయం కట్టు బొట్టుతో నందమూరి అభిమానుల్లో బాలన్ హాట్ టాపిక్ అయ్యారు.
అంతకుముందు ఐటెమ్ గాళ్ విజయలక్ష్మి అలియాస్ సిల్క్ స్మిత పాత్రలో నటించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ బాలన్ ఏ ప్రయోగం చేసినా అది ప్రేక్షకులకు చేరువైంది. హాట్ టాపిక్ అయ్యింది. తనలోని విలక్షణ నటిని సంతృప్తి పరిచే ప్రయత్నంతోనే ఇది సాధ్యమైంది. అందుకే బాలీవుడ్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా అగ్ర నాయికల్లో ఠఫ్ ఛాలెంజర్ గా ఎదిగింది.
విద్యా బాలన్ తన కెరీర్ లో మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు అంగీకరించారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జీవితకథలో నటించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఈ చిత్రాన్ని తన భర్త ఆదిత్యారాయ్ కపూర్ నిర్మించనున్నారు. అన్నీ కుదిరితే ఈపాటికే ఈ మూవీ ప్రారంభం కావాల్సి ఉన్నా మహమ్మారీ లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. దీనికి తోడు ఇందిరాగాంధీ జీవితంపై బోలెడంత రీసెర్చ్ చేయాల్సి ఉందని .. స్క్రిప్టు రెడీ అయ్యేందుకు ఆలస్యమైందని కూడా బాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వచ్చే ఏడాది లో ఈ సినిమా ప్రారంభమవుతుందని కూడా తెలిపారు.