Begin typing your search above and press return to search.

వారికి స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

By:  Tupaki Desk   |   11 Jun 2019 9:29 AM GMT
వారికి  స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. ఆమె ఓవర్‌ వెయిట్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే చాలా విమర్శలు ఎదుర్కొందట. లావు ఎక్కువ ఉన్న ఈమె ఎలా హీరోయిన్‌ అవుతుంది అంటూ చాలా మంది విమర్శించారట. ప్రతిభ ఉంటే లావు మరియు కలర్‌ తో సంబంధం లేకుండా సక్సెస్‌ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతో నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాను అంది.

తాజాగా తమిళంలో అజిత్‌ కు జోడీగా పింక్‌ రీమేక్‌ అయిన 'నేర్కొండ పార్వై' చిత్రంలో నటించింది. ఆ చిత్రం ప్రమోషన్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇతరుల శరీర బరువు మరియు ఛాయల గురించి జోకులు చేయకూడదని అది వారిని ఎంతగా ఇబ్బంది పెడుతుంతో గుర్తించాలని కోరింది. అవతలి వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. మనం చేయలేనిది ఇతరులు చేస్తున్నారంటే వారిని ఇబ్బందికర మాటలతో కిందికి లాగే ప్రయత్నాలు చేయడం చెడ్డ వారి లక్షణం అంది.

సౌత్‌ లో ఈ ఏడాది 'ఎన్టీఆర్‌' చిత్రంలో కనిపించిన విద్యా బాలన్‌ తాజాగా తమిళంలో అజిత్‌ కు జోడీగా కూడా నటించింది. బాలీవుడ్‌ లో కాస్త అవకాశాలు తగ్గడం వల్ల సౌత్‌ వైపు ఈమె దృష్టి పడ్డట్లుగా అనిపిస్తోంది. బాలీవుడ్‌ లో పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించిన విద్యాబాలన్‌ ఈమద్య కాలంలో తన బరువు గురించి పదే పదే మీడియా ముందు మాట్లాడుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం తనకున్న ఒక అరుదైన వ్యాది కారణంగా బరువు పెరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరో ఇంటర్వ్యూలో బరువు ఉన్నా కూడా నేను సినిమా హీరోయిన్‌ అవ్వాలనుకోవడం గురించి ప్రస్థావించింది. తాజాగా తనను ట్రోల్‌ చేసిన వారికి కౌంటర్‌ ఇచ్చింది.