Begin typing your search above and press return to search.
పద్మశ్రీ, డాక్టరేటును మించిన గౌరవం
By: Tupaki Desk | 23 Jun 2015 11:30 AM GMTవిద్యాబాలన్ కెరీర్‌లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. జాతీయ ఉత్తమ నటిగా కీర్తినార్జించింది. ఫిలింఫేర్ ఉత్తమ నటిగా పేరు ఘడించింది. ఉత్తమ డెబ్యూ, ఉత్తమ కథానాయిక అంటూ మన్ననలు అందుకుంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలే ప్రశంసలు. ఓ నటిగా పీక్స్ అంటే ఇంతకంటే ఏం చూపించాలి. విద్యా అన్నిటినీ చూపించేసింది. అంతెందుకు ముఖ్యమంత్రులు, ప్రధానులే గౌరవించేలా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకుంది.
డర్టీ హీరయిన్ అని తిట్టుకున్నవాళ్లే పద్మశ్రీగారూ అని పిలిచారు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్న బాలన్‌కి వీటన్నిటినీ మించిన ఆనందాన్నిచ్చే ఒకే ఒక్క అనుభవం ఇటీవలే ఎదురైంది. ఓ టీనేజర్ ఫ్యాన్ ఏకంగా ఢిల్లీ నుంచి ముంబై వచ్చేసింది. అంతేనా తన కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించి ఎదరు చూసింది. ముంబైలో బాలన్ నివాసం ఉంటున్న ఇంటి గేటు ముందు ఒక పూటంతా నిలబడింది. సెక్యూరిటీతో ఎలాగైనా బాలన్‌ని కలవాలి. తను తెచ్చిన బహుమతిని ఇవ్వాలని చెప్పింది. చివరికి బాలన్ పడవలాంటి ఓ కార్‌లో రానే వచ్చింది. అక్కడ ఉన్న ఆ అభిమానిని చూసింది. తనని లోపలికి పిలిచి గంట పైగా సమయం వెచ్చించి ముచ్చటించింది.
అంతేనా తన అభిమాని అందించిన అరుదైన కానుక అందుకుని మురిసిపోయింది. అసలింతకీ ఆ అభిమాని ఇచ్చిన కానుక ఏంటనుకునేరు? ఓ స్క్రాప్ బుక్. అందులో బాలన్‌కి సంబంధించిన ఫోటోలు మాత్రమే అతికించి ఉన్నాయి. పదేళ్ల కెరీర్‌లో ఎన్నడూ చూడనిది. అనుభవించనిది ఇది. పద్మశ్రీ కంటే, యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ కంటే గొప్ప పురస్కారమిదని ఎంతో సంతోషించింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదైనవి.