Begin typing your search above and press return to search.

బ‌స‌వ‌తార‌క‌మే ఇందిర‌మ్మ‌?!

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:58 PM GMT
బ‌స‌వ‌తార‌క‌మే ఇందిర‌మ్మ‌?!
X
భార‌త‌దేశ‌ మోస్ట్ ప‌వ‌ర్‌ ఫుల్ మ‌హిళా ప్ర‌ధాని ఇందిరా గాంధీపై వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుంది. ఈ సిరీస్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించేందుకు విద్యా బాల‌న్ సంత‌కం చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌ఖ్యాత పుస్త‌క ర‌చ‌యిత సాగ‌రిక ఘోష్ పుస్త‌కం `ఇందిర‌: ఇండియాస్ మోస్ట్ ప‌వ‌ర్‌ ఫుల్ ఉమెన్‌` పుస్త‌కం ఆధారంగా ఈ సిరీస్‌ ని తెర‌కెక్కించనున్నారు. రోనీ స్క్రూవాలా ఈ నిర్మాత‌గా పెట్టుబ‌డులు స‌మ‌కూర్చ‌నున్నారు.

అయితే ఇందిర‌మ్మ‌గా న‌టించ‌డం అంటే ఆషామాషీ కాదు. అచ్చం ఆహార్యాన్ని య‌థాత‌థంగా దించేయాల్సి ఉంటుంది. లేదంటే ఇందిర‌మ్మ‌కు ఉన్న వైడ్ రేంజ్ ఫ్యాన్స్ తీవ్రంగా హ‌ర్ట‌యిపోవ‌డం ఖాయం. ఇందిర‌మ్మ‌కు మాత్ర‌మే చెల్లిన ఆ క‌ట్టు బొట్టు - ఆహార్యం - ఆంగికం అన్నిటినీ బోలెడంత స్ట‌డీ చేయాల్సి ఉంటుంది. అందుకే .. పుస్త‌కం ఆధారంగా తెర‌కెక్కిస్తున్నా.. ఇందిర జీవితంపై ఇంకా ఇంకా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వివ‌రాల సేక‌ర‌ణ చేస్తున్నారు. ఇందిర‌మ్మ‌కు సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని ఎంతో డీప్‌ గా ప‌రిశోధిస్తున్నారు. ఇంకా సినిమా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేయ‌లేదు. అంత‌కుముందే ఇందిర‌మ్మ కుటుంబ స‌భ్యుల నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సిరీస్‌ ఎంత‌కాలం పాటు - ఎన్ని ఎపిసోడ్ లుగా సాగుతుంది? అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ఠ‌త లేదని తాజాగా విద్యాబాల‌న్ ఓ చిట్‌ చాట్‌ లో వెల్ల‌డించారు.

బాల‌న్ త‌న‌కు ఈ అవ‌కాశం రావ‌డం పట్ల‌ ఎంతో ఎగ్జ‌యిటింగ్‌ గా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. సిల్కు స్మిత జీవిత‌క‌థతో తెర‌కెక్కిన `డ‌ర్టీ పిక్చ‌ర్‌`లో డ‌ర్టీ ఎక్స్‌ ప్రెష‌న్స్‌ తో గుబులు రేకెత్తించిన విద్యా ఇప్పుడు.. అందుకు పూర్తి విభిన్నంగా ఇందిర‌మ్మ పాత్ర‌లో న‌టించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. అంత‌కంటే ముందే టాలీవుడ్‌ లో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించే ఛాన్స్ వ‌రించ‌డంపైనా బాల‌న్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. సౌత్‌లో ఎప్పుడూ న‌టించ‌లేదు. ఎన్టీఆర్‌ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర‌లో న‌టిస్తున్నాన‌ని బాల‌న్ తెగ మురిసిపోతోంది.