Begin typing your search above and press return to search.

బాలయ్యకు నో చెప్పారా?

By:  Tupaki Desk   |   15 March 2018 8:14 AM GMT
బాలయ్యకు నో చెప్పారా?
X
నందమూరి తారక రామారావు పై సినిమా వస్తోంది అన్నప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. సినీ ప్రముఖులు కూడా సినిమాను చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బయోపిక్ పట్టాలెక్కేందుకు ఇంకా సమయం చాలానే ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ చిత్ర యూనిట్ ని పూర్తిగా సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో బాలయ్య చాలా అలొస్తున్నారట.

ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం ఇప్పటికే చాలా ఆడిషన్స్ నిర్వహించారు. దర్శకుడి తేజ ఆలోచన ప్రకారం కొంచెం ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితేనే బెటర్ అని చెప్పాడట. బాలయ్య కూడా అలానే ఆలోచిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం నిత్యా మీనన్ అయితే బెటర్ అని అంతా అనుకున్నారు. కానీ కాన్సెప్ట్ వినగానే ఆమె రిజెక్ట్ చేసేసిందని వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ని కూడా అడిగారు.

అయితే ఆమె మొదట కొంచెం పాజిటివ్ గానే స్పందించినా మరికొన్ని రోజుల తరువాత కొన్ని కారణాల వలన రిజెక్ట్ చేసిందట. డేట్స్ సెట్ కాకపోవడం వల్ల నో చెప్పిందని ఆమె సన్నిహితులు చెబుతున్నా టాలీవుడ్ లో వచ్చే రూమర్స్ మాత్రం మరోలా ఉన్నాయి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ సతీమణి క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ బాలయ్య ఆలోచిస్తున్నారు.