Begin typing your search above and press return to search.
విద్యాబాలన్.. ఆ సినిమాకు అవార్డు వస్తుందనుకుందట!
By: Tupaki Desk | 10 April 2019 6:31 AM GMTజాతీయ ఉత్తమ నటి అవార్డును పొందిన నటీమణి విద్యాబాలన్. గ్లామరస్ హీరోయిన్ పాత్రలు ధరించే దశ దగ్గర నుంచి తనే ప్రధాన పాత్రల్లో నటించేంత స్థాయికి ఎదిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. విద్యాబాలన్ కు సోలోగానే కొంత మార్కెట్ ఏర్పడింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తే.. సినిమా బాగుంటే.. దానికి పదుల కోట్ల రూపాయల వసూళ్లు కూడా సాధ్యం అవుతూ ఉన్నాయి.
ఇలా తనకంటూ చాలాకాలం నుంచినే ప్రత్యేకతను చాటుకొంటూ వస్తోంది విద్య. ఇక ఇలాంటి సినిమాల విషయంలో అవార్డులు కూడా నటీమణులు ఆశిస్తూ ఉంటారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సహజంగానే అవార్డులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా విద్యాబాలన్ అవార్డుల నటీమణి అయ్యింది.
అయితే తనకు ఈ విషంలో కొంత అసంతృప్తి ఉందని, కొన్ని సినిమాలకు తను అవార్డులను ఆశిస్తే అవి దక్కలేదని విద్య వాపోయింది. అలా ఈ నటీమణి అవార్డును ఆశించి భంగపడిన సినిమా ఏదో కూడా చెప్పేసింది. ‘భూల్ భులయ్యా’ సినిమాలో తన నటనకు గానూ అవార్డును ఆశించిందట విద్య. అయితే అది దక్కలేదని ఇన్నేళ్ల తర్వాత ఆమె చెప్పింది.
మలయాళ, తమిళ , తెలుగు, కన్నడ భాషల్లో సూపర్ హిట్ అయిన 'చంద్రముఖి'సినిమాకు హిందీ రీమేకే భూల్ భులయ్యా. ఒక మళయాల సినిమా ఆధారంగా కన్నడ, తెలుగు, తమిళ వెర్షన్లు వచ్చాయి. ఆ తర్వాత దాన్నే హిందీలో రీమేక్ చేశారు. తెలుగు, తమిళ వెర్షన్లలో జ్యోతిక చేసిన పాత్రను హిందీలో విద్య చేసింది. ఆ సినిమాలో తన నటనను అంతా ప్రశంసించారని, దీంతో అవార్డు ఖాయమనుకున్నట్టుగా.. అయితే ఎవరూ తనకు అవార్డును ఇవ్వకపోవడం షాక్ కు గురి చేసిందని విద్య వ్యాఖ్యానించింది! 'కొన్ని సార్లు అంతే..' అంటూ తనకు తనే సమాధానం చెప్పుకుంది!