Begin typing your search above and press return to search.
అప్పుడు నా శరీరంను నేనే ద్వేషించే దాన్ని
By: Tupaki Desk | 9 March 2021 5:30 AM GMTహీరోయిన్ అంటే అందంతో పాటు నాజూకు గా ఉండటం చాలా అవసరం. బొద్దుగా ఉండే వారిని స్టార్ హీరోయిన్ గా కాదు కదా కనీసం హీరోయిన్ గా కూడా ప్రేక్షకులు ఆధరించేందుకు ఇష్టపడరు. కాని విద్యా బాలన్ విషయంలో లావును ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు మొదట్లో ఆమె వెయిట్ గురించి మాట్లాడినా ఆ తర్వాత ఆమె చేసిన పాత్రల వెయిట్ నేపథ్యంలో ఆమెకు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. అనారోగ్య సమస్య కారణంగా బరువు పెరిగిన విద్యా బాలన్ మొదట్లో తన శరీరంను తానే ద్వేషించుకునేదట. తాను ఎందుకు ఇంత లావు ఉన్నాను నా శరీరం ఎందుకు ఇలా ఉందంటూ ఆమె పదే పదే అసంతృప్తిని వ్యక్తంచేసేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.. నా వెయిట్ చాలా సార్లు నాకు ఇబ్బంది కలిగించింది. ఒకానొక సమయంలో నా వెయిట్ ఏకంగా జాతీయ సమస్య అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నా వెయిట్ గురించి అందరు మాట్లాడుతున్న సమయంలో నిరాశ నిస్పృహకు లోనయ్యేదాన్ని. కాని ఆ తర్వాత తర్వాత నాకు ఉన్న శరీరం ను నేను ఎందుకు ద్వేషించాలి.. నాకు ఉన్న ఒక్క శరీరంను ప్రేమించుకోవాలని భావించాను. ఈ శరీరమే లేకుంటే నేను అనేదాన్ని లేను కదా అనే ఆలోచన నాకు వచ్చిన సమయంలో నా శరీరంను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను. తనలా బరువు విషయమై బాధ పడే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విద్యా బాలన్ సలహా ఇచ్చింది.