Begin typing your search above and press return to search.
స్విమ్ సూట్ ఫోటో షేర్ చేస్తే విడాకులు ఎప్పుడని అడుగుతున్నారట
By: Tupaki Desk | 5 Oct 2021 5:30 PM GMTమిగిలిన చిత్ర రంగాల్ని పక్కన పెడితే.. టాలీవుడ్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసే నటీమణులకు గుర్తింపు లభించటం అన్నది అంతగా ఉండదు. అలాంటి రికార్డును బ్రేక్ చేసిన క్రెడిట్ మాత్రం బొద్దుగుమ్మ దే. చూసినంతనే మిగిలిన వారికి భిన్నంగా ఉండే ఈమె.. హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్నిపెద్ద ఎత్తున నటించారు. బొద్దుగా ఉండే ఆమెను చూసినంతనే పెదాల మీద నవ్వు రావటం ఖాయం. అలా అందరికి దగ్గరైన ఆమె.. ఈ మధ్యన కీటో డైట్ ను సీరియస్ గా ఫాలో అయి.. సన్నబడి అందరికి షాకిచ్చారు.
తన రీసెంట్ ఫోటోల్ని షేర్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచిన ఆమె.. తన పెళ్లి విషయంలోనూ అలాంటి షాకే ఇచ్చారు. తాను సన్నబడటానికి సాయం చేసిన కీటో డైట్ ఎక్స్ పర్ట్ సంజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి సెప్టెంబరు తొమ్మిదిన జరిగింది. తమిళ.. సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి పెళ్లి చెన్నైలో జరిగింది.
తక్కువమందితో జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు.. బాగా దగ్గరైన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. జంటగా మారిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోల్ని షేర్ చేస్తోంది. హానీమూన్ కు వెళ్లిన సందర్భంలోనూ ఆమె పలు ఫోటోల్ని షేర్ చేశారు. ఇదిలాఉంటే.. రీసెంట్ గా స్విమ్ సూట్ వేసుకొన్న ఫోటోను పోస్టు చేశారు. దానికి బదులుగా పలువురు.. ‘విడాకులు ఎప్పుడు’ అని మెసేజ్ చేయటంపైఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
స్విమ్ సూట్ ధరించి ఫోటో షేర్ చేస్తే.. విడాకులేనా? అన్న ఆమె.. కాస్తంత ఘాటుగా రియాక్టు అయ్యింది. 1920 నుంచి 2021లోకి రావాలని.. సమాజంలోని ఆలోచనా ధోరణే అసలైన సమస్యగా అభివర్ణించింది. మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే చక్కగా దుస్తులు ధరించిన వారంతా సంతోషకరమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా? అని క్వశ్చన్ చేసింది. విమర్శల్ని వదిలేయాని.. సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని తాను మర్చలేనంటూ సీరియస్ గా కామెంట్ చేయటంతో ఆమె పోస్టు ఇప్పుడు చర్చగా మారింది.