Begin typing your search above and press return to search.
సరైనోడి వదినకు.. విముక్తి..
By: Tupaki Desk | 5 May 2016 10:52 AM GMTరాజుగారి గది - రన్ రాజా రన్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి విద్యుల్లేఖ. రీసెంట్ గా వచ్చిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ కి వదినగా.. సాంబార్ కామెడీతో తెగ హంగామా చేసిన విద్యుల్లేఖ.. వియన్నాలో ఇరుక్కుపోయింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా టూర్ లో ఉండగా విద్యుల్లేఖ బ్యాగ్ మిస్ అయింది. దీంతో ఆమె పాస్ పోర్ట్ - మనీ - కార్డ్స్.. ఇలా అన్నీ మిస్ అయిపోవడంతో కంగారుపడిందీమె.
అయితే.. తనకు సాయం చేయాలంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ - విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లను ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసింది విద్యుల్లేఖ. దీంతో ఆస్ట్రియాలోని భారత ఎంబసీ ఆమెకు అండగా నిలిచి.. సహాయానికి ముందుకు వచ్చింది. టెంపరరీగా ట్రావెల్ పర్మిట్ మంజూరు చేయడంతో.. ఆమెకు అక్కడి ఇబ్బందుల నుంచి విముక్తి కలిగింది. ఈ విషయాన్ని తనే ట్వీట్ ద్వారా తెలిపింది విద్యుల్లేఖ. 'సమాచారం ఇచ్చి, సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద థ్యాంక్స్. వియన్నాలోని ఇండియన్ ఎంబసీ నాకు టెంపరరీ ట్రావెల్ పర్మిట్ ఇచ్చింది. ఇవాళే నేను ఇండియా తిరిగి బయల్దేరుతున్నా' అంటూ ట్వీట్ చేసింది ఈ కామెడీ యాక్ట్రెస్.
తోటి నటికి వచ్చిన ఇబ్బందికి చాలామంది వెంటనే స్పందించినా.. ఆమెకు ఏ విధంగా సాయం చేయాలో అర్ధం కాక మిన్నకుండిపోయిన వారు కూడా.. ఆమె ఇబ్బందులు తీరాయనే విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.