Begin typing your search above and press return to search.
'ఇండస్ట్రీ వ్యక్తులే మమ్మల్ని గుర్తించరు'
By: Tupaki Desk | 25 July 2020 12:30 AM GMTబాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. 'శక్తి' 'ఊసరవెల్లి' 'తుపాకీ' 'సికిందర్' చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. 'జంగ్లీ' మరియు 'కమాండో' సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించిన విద్యుత్ జమ్వాల్ తన స్టంట్స్ తో ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేసాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విద్యుత్ కెరీర్ ఆరంభంలో విలన్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చి ఇప్పుడు హీరోగా బిజీగా మారిపోయాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న నెపోటిజం చర్చలపై విద్యుత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ.. ''సినీ ఇండస్ట్రీలో నువ్వు బయటి వ్యక్తివి అని తెలియజేసే సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సిస్టమ్ అలా ఉంది. దీన్ని ఎవరూ మార్చలేరు. కానీ సాటి మనిషిని పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి మారాలని నేను కోరుకుంటున్నాను. వారు చూసిన ప్రతి దానిని అభినందించాలి. దీనికి నెపోటిజంతో సంబంధం లేదు. కేవలం మంచి మనిషిగా మాత్రమే ఉండాలి. ఎవరైనా ఏదైనా చేస్తే వారికి గుర్తింపు ఇవ్వాలి'' అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ''మేం చేసే పనికి ప్రజలు మాపై ప్రేమ కురిపిస్తారు. కానీ సినీ ఇండస్ట్రీ వ్యక్తులే మమ్మల్ని గుర్తించరు. కనీసం ఓ ట్వీట్ కూడా చేయరు. ఇలాంటివి నన్ను పెద్దగా బాధించవు. అన్నింటికి సిద్ధమయ్యే నేను ఇక్కడికి వచ్చాను. ఒక మార్గం మూసుకుపోతే వంద మార్గాలు తెరుచుకుంటాయి. నా జర్నీలో నేను తెలుసుకున్నది ఇదే. మనల్ని ఎవరు ఆపలేరు'' అని విద్యుత్ పేర్కొన్నారు.
కాగా విద్యుత్ జమ్వాల్ నటించిన 'యారా' సినిమా జూలై 30న జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది. మరో సినిమా 'ఖుదా హఫీజ్' కూడా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఇక విద్యుత్ జమ్వాల్ ఇటీవల '10 పీపుల్ యు డోంట్ వాంట్ టు మెస్ విత్' ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పది మంది ప్రముఖుల జాబితాలో భారతదేశం నుండి విద్యుత్ జమ్వాల్ ఒక్కరే ఉండటం విశేషం.