Begin typing your search above and press return to search.

ఇక్కడ డిజాస్టర్ కి చైనాలో అవార్డు

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:23 PM IST
ఇక్కడ డిజాస్టర్ కి చైనాలో అవార్డు
X
కొన్ని సినిమా వింతలు అంతే. ఓ పట్టాన అర్థం కావు. ఇక్కడ డిజాస్టర్ అనిపించుకున్నవి పక్క దేశంలో బాగా గుర్తింపు తెచ్చుకుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఆ మధ్య కమాండో హీరో విద్యుత్ జమాల్ జంగ్లీ అనే మూవీ ఒకటి చేశాడు. అడవి నేపథ్యంలో జంతువుల మధ్య సాగే కథలో జమాల్ టార్జాన్ తరహా పాత్రను పోషించాడు. అయితే ఇది ఆశించిన విజయం సాధించలేదు. బాక్స్ ఆఫీస్ లెక్కల్లో దీన్ని డిజాస్టర్ గానే తేల్చేశారు. కానీ చైనా నుంచి దీనికి అద్భుతమైన గుర్తింపు లభించింది.

అక్కడి వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాకీ చాన్ ఇంటర్నేషనల్ ఫిలిం వీక్ లో దీనికి బెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఫిలిం తో పాటు బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫర్ అవార్డుల ప్లస్ స్పెషల్ జ్యూరీ ప్రైజ్ కూడా ప్రకటించారు. ఒక విదేశీ చిత్రానికి ఈ స్థాయిలో గుర్తింపు దక్కడం అంటే మాములు విషయం కాదుగా. దీనికి విద్యుత్ జమాల్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సాధారణంగా ఏదైనా యాక్షన్ స్టంట్ చేస్తే ఇవన్నీ జాకీ చాన్ ఎప్పుడో చేశాడు అనే కామెంట్స్ వింటుంటానని అలాంటిది ఆయన పేరు మీద ప్రెస్టీజియస్ అవార్డులు తమ జంగ్లీకి దక్కడం పట్ల ఇతగాడి ఆనందం మాములుగా లేదు.

విద్యుత్ జమాల్ మనకూ సుపరిచితుడే. విజయ్ హీరోగా నటించిన తుపాకీలో మెయిన్ విలన్ గా లుక్స్ తో నటనతో అదరగొట్టింది ఇతగాడే. కమాండో మూవీ ఇతనికి చాలా పేరు తెచ్చింది. ఏనుగు దంతాల దొంగతనం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ జంగ్లీ మూవీలో అంత ఏముందో అని రిలీజైన ఇన్ని నెలలకు నెటిజెన్లు ఆన్ లైన్లో దీన్ని చూసేయడం మొదలుపెట్టారు