Begin typing your search above and press return to search.

సన్ షైన్ అంటే నయనతారేగా??

By:  Tupaki Desk   |   19 Sept 2017 5:26 PM IST
సన్ షైన్ అంటే నయనతారేగా??
X
సినిమా తరాల మధ్య ప్రేమ చిగురించడం ప్రస్తుత రోజుల్లో చాలా సాధారణ విషయమే అయితే చాలా వారుకు తారలు ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ కొంత మంది చెప్పకనే చెబుతూ.. మీడియాకి పజిల్స్ వదులుతూ ఉంటారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకోని పలు మీడియాల్లో కథనాలు వెలువడే సరికి తరాలకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక మళ్లీ మీడియా వద్దకు రావడానికి కూడా అస్సలు ఇష్టపడరు.

కానీ ఎన్ని రూమర్లు వచ్చినా సౌత్ బ్యూటీ నయన తార ఏ మాత్రం లెక్క చేయను అంటోంది. ఇప్పటికే శింబు అండ్ ప్రభుదేవాలతో ప్రేమాయణాన్ని కొనసాగించి బ్రేకప్ చేసిన నయన ఇప్పుడు యువ దర్శకుడైన విగ్నేష్ తో విదేశాల్లో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. అమ్మడికి ఏ క్షణాన ఆ దర్శకుడు పరిచయం అయ్యాడో గాని అతను లేనిదే నేను లేను అనే విధంగా ప్రవర్తిస్తోంది. మూడేళ్ళ నుంచి విగ్నేష్ తో అంత క్లోజ్ గా తీరుగుతున్నా ఇంతవరకు రిలేషన్ ని బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక వీరి బంధం గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెలువడుతున్నాయి. రీసెంట్ గా విగ్నేష్ బర్త్ డే సందర్బంగా అతనితో కలిసి న్యూ యార్క్ వెళ్లిన నయన అక్కడ బర్త్ డే వేడుకని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్ని విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు. తాను ఇంత హ్యాపీగా కలలో కూడా తన పుట్టిన రోజును జరుపుకోలేదని చెబుతూ..దేవుడు కి కృతజ్ఞతలు అన్నాడు. అలాగే మై డియర్ సన్ షైన్ కి కూడా కామెంట్ పెట్టి నయనతో దిగిన ఫోటోలు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.