Begin typing your search above and press return to search.

నయన ప్రియుడు ఎలా విష్ చేశాడో చూడండి..

By:  Tupaki Desk   |   18 Nov 2017 1:30 PM GMT
నయన ప్రియుడు ఎలా విష్ చేశాడో చూడండి..
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారతో తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్ బంధం గురించి ఇంకేమైనా సందేహాలుంటే వాటిని పూర్తిగా తీర్చేసుకోవచ్చు. ఈ రోజు నయనతార పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెతో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోను ట్విట్టర్లో తన డిస్‌ ప్లే పిక్ గా పెట్టడమే కాదు.. ఆమెకు చాలా ఆత్మీయంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా తమ బంధాన్ని ధ్రువీకరించాడు విఘ్నేష్.

తాను ఎక్కువగా ఎదురు చూసే మహిళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మొదలుపెట్టిన అతను.. ఆమె ఎప్పుడూ ఇంతే బోల్డ్ గా.. బ్యూటిఫుల్ గా ఉండాలని ఆకాంక్షించాడు. నయనతార అంటే ఏంటో ఎప్పుడూ చాటి చెబుతూనే ఉండాలని అన్న విఘ్నేష్.. ఆమెను చూస్తే తనకెప్పుడూ గర్వంగా ఉంటుందని అన్నాడు. నయనను ‘తంగమే’ (బంగారమే అని అర్థం) అని పేర్కొన్న విఘ్నేష్.. ఆమెకు టన్నులకొద్దీ ప్రేమ.. గౌరవం ఇస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

ఈ సుదీర్ఘమైన విష్ ద్వారా నయనతో తాను డీప్ లవ్ లో ఉన్న సంగతిని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్. ప్రభుదేవా నుంచి విడిపోయాక రెండేళ్లు ఖాళీగా ఉన్న నయన్.. తనతో ‘నానుమ్ రౌడీదా’ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేష్ కు దగ్గరైంది. ఇటీవలే ‘అరామ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నయన అందరితోనూ ‘లేడీ సూపర్ స్టార్’ అనిపించుకుంటోంది. మరోవైపు విఘ్నేష్ సూర్య హీరోగా ‘తానా సేంద్ర కూట్టం’ అనే సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.