Begin typing your search above and press return to search.

పాజిటివ్ గా ఆలోచించండి

By:  Tupaki Desk   |   3 Feb 2018 4:30 AM GMT
పాజిటివ్ గా ఆలోచించండి
X
సినిమా ఇండస్ట్రీలో రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కష్టపడే తత్వం ఉన్నా వన్ పర్సెంట్ లక్ ఉంటేనే బిజీ అవుతారు. నటీనటుల సంగతి ఎలా ఉన్నా టెక్నీషియన్స్ మాత్రం మళ్లీ పుంజుకోవలంటే చాలా కష్టమైన పని. ముఖ్యంగా దర్శకుడు రికవర్ అవ్వాలంటే అతనికి సంకల్పం చాలానే ఉండాలి. రైటర్స్ నటీనటులు మళ్లీ సెట్ అవ్వచ్చు గాని సినిమా రిజల్ట్ అతనిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.

అయితే రీసెంట్ గా కొన్ని సినిమాలు దర్శకులకు ఉహించని విధమైన రిజల్ట్ ని ఇచ్చాయి. అందులో గ్యాంగ్ దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా చేరాడు. పొంగల్ బరిలో దిగిన సూర్య - గ్యాంగ్ అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. పైగా చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎక్కువగా శివన్ డైరెక్షన్ పై కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే ఫైనల్ గా దర్శకుడు తనకు తాను ధైర్యం చెప్పుకునే విధంగా అలాగే నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే విదంగా ఒక ఫిలాసఫీ చెప్పడు.

సినిమాల యొక్క నెంబర్ గేమ్ నిర్మాత ఆలోచన మాత్రమే! ప్రేక్షకులకు ఇక్కడ ఆనందిస్తారు.. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్. మేము ప్రతి సినిమా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించిన రోజులు వెళ్లిపోయాయి!. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి విషయంపై విమర్శలు చేస్తున్నారు. అది అవసరం లేదు. ఇది ఒక అందమైన జీవితం & పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించండి అంటూ.. విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.