Begin typing your search above and press return to search.
అప్పుడే పెళ్లా?? టైముందట
By: Tupaki Desk | 29 Jun 2017 12:38 PM GMTసౌత్ సుందరి నయనతార.. టాప్ స్టార్ గా వెలిగిపోతోంది. ఈ భామను సినిమాకి ఒప్పించడం అంటే.. ఆ మూవీ సగం విజయం సాధించేసినట్లే అనే ఫీలింగ్ మేకర్స్ కు వచ్చేసింది. అయితే..కెరీర్ పరంగా ఎన్ని సాధించినా.. పర్సనల్ లైఫ్ లో ఈమెకు బాగానే ఎదురుదెబ్బలు తగిలాయి.
మొదట శింబు.. ఆ తర్వాత ప్రభుదేవాలతో బ్రేకప్ అయిన నయనతార.. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉందనే విషయం ఇప్పటికి చాలాసార్లే నిరూపితమైంది. గతేడాది ఓనమ్ పండుగకు నయన్ ఇంట్లో విఘ్నేష్ గడిపితే.. సంక్రాంతి పండుగను ఇద్దరూ కలిసి తెగ సంబరంగా చేసేసుకున్నారు. ఇద్దరూ కలిసి మూడేళ్లుగా ప్రేమాయణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. మరి ఇంత సుదీర్ఘ కాలం లవ్వాడుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యానికి వచ్చి ఉంటారని అంతా భావించారు.
అదే ప్రశ్నను విఘ్నేష్ ని అడిగేశారు మీడియా మిత్రులు. కానీ ఈ డైరెక్టర్ నుంచి మాత్రం రియాక్షన్ వేరుగా వచ్చింది. నయనతారతో పెళ్లి అనగానే.. విఘ్నేష్ శివన్ కళ్లు డైమండ్స్ టైపులో మెరిసిన మాట నిజమే అయినా.. అప్పుడే పెళ్లేంటీ.. ప్రస్తుతం కెరీర్ పై ఫుల్లుగా ఫోకస్ చేశానంతే అంటూ మాట దాటేశాడు. అయితే.. నయనతార-విఘ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకోకపోయినా.. దాదాపుగా సహజీవనం చేస్తున్నారని.. ఫారిన్ ట్రిప్పులు లాంటివన్నీ కలిసే కంప్లీట్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. మరోవైపు అయితే.. ఆల్రెడీ పెల్ళి అయిపోయిందని కూడా టాక్. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/