Begin typing your search above and press return to search.

త్రిష, నయనతారల్ని కలిపిందెవ్వరు?

By:  Tupaki Desk   |   6 March 2016 11:30 AM GMT
త్రిష, నయనతారల్ని కలిపిందెవ్వరు?
X
త్రిష హీరోయినయ్యి దాదాపు దశాబ్దంన్నర అవుతోంది. నయనతార కూడా దాదాపు పుష్కర కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ వీళ్లిద్దరూ కలిసి కనిపించడం అరుదు. కలిసి ఓ ఫొటో దిగినా తప్పనిసరి పరిస్థితుల్లోనే అయి ఉంటుంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకప్పుడు వీళ్లిద్దరూ తెలుగు తమిళ భాషల్లో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడ్డారు. పైగా తాను మాంచి రైజింగ్‌ లో ఉండగా.. నయన్ వచ్చి తన స్థానానికి గండి కొట్టిందని.. తన అవకాశాలు కొన్ని లాగేసుకుందని త్రిషకు కోపం. నయన్ కూడా త్రిష విషయంలో దూరం దూరంగానే ఉండేది. గతంలో వీళ్లిద్దరినీ ఒకే సినిమాలో నటింపజేయాలని ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవి ఫలించలేదు. ఇద్దరూ అందుకు ఒప్పుకోలేదు.

ఐతే ఇప్పుడు ఆ పట్టువిడుపులన్నీ వదిలేసి కలిసి నటించడానికి రెడీ అయిపోతున్నారట త్రిష -నయనతార. చిన్న హీరోగా మొదలై.. ఇప్పుడు స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి వీళ్లిద్దరితో రొమాన్స్ చేయబోతున్నాడట. ఇంతకీ త్రిష - నయనతారల్ని ఒకే సినిమాలో నటించేలా ఒప్పించింది ఎవరో తెలుసా..? నయన్ ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేష్ శివన్. అతను విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా ‘నానుమ్ రౌడీ దా’ అనే మాంచి హిట్టు కొట్టాడు. తర్వాత ఇదే జంటతో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. ఐతే కొత్తగా త్రిష కూడా యాడ్ అవుతోంది. అతనే నయనతారను - త్రిషను ఒప్పించి ఈ సినిమాకు అంగీకరించేలా చేశాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.