Begin typing your search above and press return to search.

నయనతారను ‘బంగారం’ అన్న ప్రియుడు

By:  Tupaki Desk   |   18 Nov 2015 7:30 PM GMT
నయనతారను ‘బంగారం’ అన్న ప్రియుడు
X
నయనతార ప్రేమ వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. శింబుతో ఫస్ట్ ఎఫైర్ నడిపినపుడు... ప్రభుదేవాతో కొత్త లవ్ స్టోరీ మొదలుపెట్టినపుడు.. కోలీవుడ్ - టాలీవుడ్ లలో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఆమె కొత్త లవ్ స్టోరీ కూడా అంతే సెన్సేషన్ అవుతోంది. బ్రేకప్ తర్వాత చాలా ఈజీగా కొత్త లవ్ స్టోరీలోకి షిఫ్ట్ అయిపోయే నయన్ కు.. విఘ్నేష్ తో ప్రేమాయణం మొదలుపెట్టాక అద్భుతంగా కలిసొస్తోంది. ఈ ఏడాది మూడు నెలల్లో మూడు సూపర్ హిట్లతో కెరీర్ పీక్స్ చేరుకుంది నయన్. విఘ్నేష్ కూడా తన నయన్ - విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘నానుమ్ రౌడీ దా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా మారాడు. ఈ సంతోష సమయంలోనే నయనతార పుట్టిన రోజు వచ్చింది.

ఈ బర్త్ డేను నయన్ - విఘ్నేష్ పర్సనల్ గా ఎలా జరుపుకుంటన్నారో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం నయన్ పుట్టిన రోజును భలేగా జరిపాడు విఘ్నేష్. ఈ రోజు ఉదయమే ‘హ్యాపీ బర్త్ డే క్వీన్ తార’ అంటూ కేకులోంచి విచ్చుకుంటున్న నయన్ క్యారికేచర్ వేయించి.. దానికో ఆసక్తికర కామెంట్ జత చేశాడు విఘ్నేష్. ఈ కామెంట్ లో అతను నయన్ ను తంగమే (తెలుగులో బంగారం అని అర్థం) అని సంబోధించడం విశేషం. ఎప్పుడూ ఇలాగే దేవుడి కృపకు నోచుకో, ఇలాగే అందంగా ఉండు. అందరూ నిన్ను ప్రేమించేలా ఉండు, అందరి హృదయాల్లో నిలిచిపో.. అంటూ ఓ కవితాత్మక సందేశం పెట్టాడు విఘ్నేష్. నయన్ ను బంగారం అని సంబోధిస్తూ ఇలాంటి కామెంట్ పెట్టడం ద్వారా తమ ప్రేమాయణం గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడన్నమాట విఘ్నేష్.