Begin typing your search above and press return to search.

నయనతారే నా పిల్లలకు తల్లి కాబోతుంది: యంగ్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   11 May 2020 2:00 PM GMT
నయనతారే నా పిల్లలకు తల్లి కాబోతుంది: యంగ్ డైరెక్టర్
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సెలబ్రిటీ. యాక్టర్ శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ తర్వాత తమిళ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంది. అయితే విఘ్నేష్ కూడా నయనతారను డీప్ గా లవ్ చేస్తున్నాడట. వీరిద్దరూ డైలీ సీరియల్స్ ఎసిపోడ్స్ లాగా ఏదొక విధంగా సోషల్ మీడియాలో కన్పిస్తూనే ఉంటారు. ఇక విఘ్నేష్ శివన్ కంటే ముందు నయనతార ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. చివరకు ఏమైందో కానీ మొత్తానికి ప్రభుదేవాతో నయనతార బంధానికి శుభం కార్డు మాత్రం పడలేదు. ప్రభుదేవాతో సెట్ అయిపోయుంటే ఈపాటికి ఓ ఇల్లాలిగా.. నటన కొనసాగిస్తే నటిగా కూడా కొనసాగేది. ఇక విఘ్నేష్ తో బంధం అనేది ఏర్పడేది కాదు. ఇక విఘ్నేష్ తో ప్రేమలో పడ్డాక కూడా ఇరువురి మధ్య ఊరికే గొడవలు తలెత్తుతున్నాయంటూ.. వీరి బంధం కూడా నిలవదని వార్తలు వచ్చాయి.

ఎన్నో వార్తలు వీళ్లిద్దరు విడిపోవడానికి సిద్ధమయ్యారని పుకార్లు సృష్టించాయి. కానీ అవేమి నిజం కాదంటూ.. మమ్మల్ని ఎవరు విడదీయలేరని నిరూపిస్తూ.. తాజాగా విఘ్నేష్ నయనతారతో ప్రేమకు సంబంధించిన ఓ ప్రకటనతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్ నడించింది. ఇటీవలే మాతృదినోత్సవం సందర్భంగా విఘ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నయతతార ఓ పాపను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి చేతుల్లో ఉన్న పాప తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ విష్ చేస్తూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్‌తో త్వరలోనే విఘ్నేష్ శివన్‌తో నయనతార త్వరలో పెళ్లి పీటలకు ఎక్కడానికి సిద్ధమైందని అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం విఘ్నేష్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొందరైతే పెళ్లి డేట్ ఎప్పుడు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో నయనతారకు హ్యాపీ మదర్స్ డే అంటూ విష్ చేస్తున్నారు. చూడాలి మరి నయనతార ముచ్చటగా మూడోసారి అయినా పెళ్లి కార్డు వేస్తుందేమో..!