Begin typing your search above and press return to search.
అనిరుధ్ తో నయన్ స్టెప్పులు
By: Tupaki Desk | 12 Aug 2018 6:40 AM GMTఇటీవలే గాలివాలుగా...! అంటూ యువసంగీత దర్శకుడు అనిరుధ్ అదిరిపోయే గానాలాపన చేస్తూ.. వెర్రెత్తించే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. `అజ్ఞాతవాసి` ఫ్లాపైనా అనిరుధ్ ఫ్లాపవ్వలేదన్నది పక్కా నిజం. అజ్ఞాతవాసి పాటలు పవన్ అభిమానులకు బాగా నచ్చాయి. అనిరుధ్ బాణీలు అందరినీ మెప్పించాయి. కానీ అనూహ్యంగా ఫ్లాప్ తెచ్చిన ముప్పు ప్రభావం అనిరుధ్ ని దెబ్బ కొట్టింది. అతడు త్రివిక్రమ్ తోనే మరోసారి పని చేయాల్సి ఉన్నా, తదుపరి `అరవింద సమేత` అవకాశాన్ని కోల్పోవడం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. త్రివిక్రమ్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్టు నుంచి అనిరుధ్ తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది.
ఆ క్రమంలోనే అనిరుధ్ తమిళంలో పలు క్రేజీ సినిమాలకు సంతకాలు చేశాడు. సూర్య - విజయ్ వంటి పెద్ద స్టార్ల సినిమాలకు అనిరుధ్ పని చేస్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు నయనతారతో కలిసి స్టెప్పులేయబోతున్నాడన్న వేడెక్కించే వార్త అందింది. అయితే ఇదేమీ ఫీచర్ ఫిలిం కోసం కాదు. ఓ ప్రమోషనల్ వీడియో సాంగ్ కోసం మాత్రమే.
నయనతార కథానాయికగా నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `కొలమావు కోకిల` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోలో అనిరుధ్ కనిపిస్తాడట. దీనిని తెరకెక్కించే ఛాన్స్ నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ కి దక్కింది. ఈ సందర్భంగా నయన్‌తో ఓ సెల్ఫీ దిగి దానిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్ ఈ సాంగ్ ప్రోమోలో నయన్ తో పాటు అనిరుధ్ కనిపిస్తాడని తెలిపారు. గునిన్ కాదల్ అంటూ సాగే ప్రోమో కోసం నయన్‌తో కలిసి పని చేస్తున్నానని - టీఎస్ కే తర్వాత మూడేళ్లకు నయన్ తో ఛాన్స్ లభించిందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు విఘ్నేష్. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాను పాడి - సంగీతం అందించే సినిమాలకు ఇలాంటి ప్రోమో సాంగ్స్ రూపొందిస్తూ ఆకట్టుకోవడం ఇంట్రెస్టింగ్.