Begin typing your search above and press return to search.

స్టార్ క్యాస్టింగ్ ఉంటే సరిపోద్దా.. దానికి తగ్గ ప్రమోషన్స్ కూడా చేయాలిగా..!

By:  Tupaki Desk   |   31 May 2022 10:30 AM GMT
స్టార్ క్యాస్టింగ్ ఉంటే సరిపోద్దా.. దానికి తగ్గ ప్రమోషన్స్ కూడా చేయాలిగా..!
X
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. తొలి సినిమా 'మా నగరం' తోనే అందరి దృష్టిని ఆకర్షించిన లోకేష్.. 'ఖైదీ' చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 'మాస్టర్' మూవీతో మరో సూపర్ హిట్ అందుకొని క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. దీంతో ఏకంగా సీనియర్ హీరో కమల్ హాషన్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు.

విశ్వనటుడు కమల్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

'విక్రమ్' మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యువ హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. తెలుగులో మాత్రం ఈ సినిమాపై ఏమాత్రం బజ్ కనిపించడం లేదు.

జూన్ 3న 'విక్రమ్' తో పాటుగా 'మేజర్' మరియు 'సుల్తాన్ పృథ్వీరాజ్' వంటి మరో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అక్షయ్ కుమార్ సినిమా ఉత్తరాదిలో భారీగా ప్రచారం చేయబడుతోంది. అడివి శేష్ 'మేజర్' కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రివ్యూల నుంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది.

26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ కావడంతో.. ప్రతి ఒక్కరూ ఈ కథతో ఎమోషనల్‌ గా కనెక్ట్ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ బయోపిక్ పై మంచి బజ్ ఏర్పడేలా మేజర్ టీమ్ అగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక 'విక్రమ్' సినిమాని తమిళ హిందీలలో దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. కానీ కీలకమైన తెలుగు మార్కెట్ లో మాత్రం ప్రమోషన్స్ పట్టించుకోవడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో 'మేజర్' సినిమాకున్న క్రేజ్ లో 10 శాతం కూడా 'విక్రమ్' చిత్రాలనికి లేదు. ఎలాంటి బజ్ - మినిమమ్ ప్రమోషన్లు లేకుండా భారీ బడ్జెట్ సినిమాని రిలీజ్ చేస్తే వసూళ్ల పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరి ఈ రెండు రోజులైనా తెలుగు ప్రమోషన్స్ మీద దృష్టి పెడతారేమో చూడాలి.