Begin typing your search above and press return to search.
విజయ్ సినిమా ఇక్కడ రిలీజవ్వలేదు
By: Tupaki Desk | 18 Oct 2017 12:08 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘మెర్శల్’ ఈ రోజు తమిళంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. దీనికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చేలా ఉన్నాయి. ఐతే ఈ చిత్రాన్ని తెలుగులోనూ పెద్ద స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రముఖ నిర్మాత.. పవన్ కళ్యాణ్ మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్ర తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఐతే ఈ చిత్రం ఈ రోజు అనుకున్న ప్రకారం విడుదల కాలేదు. సెన్సార్ సమస్యల కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిపోయినట్లు తెలుస్తోంది.
‘మెర్శల్’కు తమిళంలోనూ సెన్సార్ సమస్యలు తలెత్తాయి. ఈ చిత్రం కోసం జంతువుల్ని హింసించారన్న ఆరోపణలతో జంతు సంరక్షణ శాఖ నుంచి ఎన్వోసీ జారీ కావడంలో ఆలస్యమైంది. ఐతే అక్కడ ఎలాగోలా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న ప్రకారమే ఈ రోజు సినిమాను రిలీజ్ చేశారు. కానీ తెలుగు వెర్షన్ సెన్సార్ విషయంలో ఏవో ఇబ్బందులు తలెత్తాయి. బుధవారం సినిమా సాయంత్రానికి కూడా సినిమా రిలీజయ్యేలా లేదు. రెండో రోజు కూడా రిలీజ్ కష్టమే అంటున్నారు. ఈ చిత్రంపై రూ.5 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన శరత్ మరార్ కు ఇది గట్టి ఎదురు దెబ్బే. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన తెండ్రాల్ ఫిలిమ్స్ బేనర్ కు ఇది వందో సినిమా. దీంతో తెలుగు వెర్షన్ ను కూడా ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాజల్ అగర్వాల్.. సమంత.. నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించడం.. ఈ చిత్రానికి కథ అందించింది విజయేంద్ర ప్రసాద్ కావడంతో తెలుగులో మంచి ఆదరణే ఉంటుందనుకున్నారు కానీ.. విడుదల విషయంలో పెద్ద పంచే పడింది.