Begin typing your search above and press return to search.

ఆ కార్ సంగతేంటి?

By:  Tupaki Desk   |   3 Jan 2018 11:42 PM IST
ఆ కార్ సంగతేంటి?
X
కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిని ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ అందుకున్నాడు అని ఇటీవల మెర్సల్ కలెక్షన్స్ తో తేలిపోయింది. విజయ్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా విజయ్ కి మంచి గుర్తింపు కూడా దక్కింది. అయితే నెక్స్ట్ ఈ హీరో మురగదాస్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది అని దర్శకుడు చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇకపోతే ఇటీవల సినిమాకి సంబంధించిన ఒక ఫోటో షూట్ ని నిర్వహించారు. అయితే అందులో విజయ్ బ్లాక్ డ్రెస్ లో ఒక బ్యాగ్ పట్టుకొని రోల్స్ రయ్స్ కార్ పక్కన నిల్చున్నాడు. అందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే కాకుండా కొన్ని రూమర్స్ కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆ కాస్ట్లీ కార్ నెంబర్ ని చూస్తుంటే (PY 01 BZ 0005) రిజిస్ట్రేషన్ పాండిచ్చేరి లో చేయించినట్లుగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ విధంగా అక్కడ కార్ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల కొంతమంది హీరోయిన్స్ ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే విజయ్ దగ్గర కూడా రోల్స్ రయ్స్ కార్ ఉంది. బహుశా అతను కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేయించడా లేక దర్శకుడు సినిమాలో ఏదైనా టాపిక్ ని అక్కడి స్టైల్ లో సెట్ చేశాడా అనే తరహాలో కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ విధంగా సవాలక్ష అనుమానాలు సోషల్ మీడియాలలో కూడా వెలువడుతున్నాయి. మరి కార్ సంగతేంటో చిత్ర యూనిటే చెప్పాలి. ఇక సినిమాలో విజయ్ సరసన మరోసారి కీర్తి సురేష్ నటిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షెడ్యూల్ పట్టాలెక్కనుంది.